Sunday, May 5, 2024
- Advertisement -

చిన్న‌ల్లుడికి వార్నింగ్ ఇచ్చిన చిరు?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుండి ఇప్ప‌టికే ఓ అర‌డ‌జ‌ను హీరోలు తెలుగు తెర‌కు ప‌రిచియమైయ్యారు.తాజాగా ఆయ‌న చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ కూడా విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. క‌థ ప‌రంగా విజేత యావ‌రేజ్ సినిమా అనిపించుకుంది.క‌ల్యాణ్ దేవ్ న‌ట‌న ఇంకా మెరుగుప‌డాల్సి ఉంది.అయితే క‌ల్యాణ్ త‌న రెండో సినిమాను తొంద‌ర‌గా మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్నాడు.కాని చిరంజీవి అల్లుడికి స‌ల‌హాలతో పాటు చిన్న‌పాటి వార్నింగ్ కూడా ఇచ్చాడ‌ని స‌మాచారం.

నటన విషయంలో మరింత శ్రద్ధ పెట్టమనీ .. డాన్స్ పై పూర్తిగా మనసు పెట్టమని కల్యాణ్ కి చిరంజీవి సలహా ఇచ్చారని అంటున్నారు.మెగా హీరోలు డాన్స్ లో తిరుగులేదనిపించుకుంటూ వస్తున్నారు. అందువలన మరికొంత కాలం శిక్షణ తీసుకుని రంగంలోకి దిగమని అన్నారట.దీంతో న‌ట‌న‌,డ్యాన్స్‌ల‌పై మ‌రింత ఫోక‌స్ పెట్ట‌ల‌ని క‌ల్యాణ్ భావిస్తున్నాడు.దీని కార‌ణంగానే అత‌ని రెండో సినిమా లేట్ అవుతుంద‌ని స‌మాచారం.క‌ల్యాణ్ దేవ్ రెండో సినిమా ఓ స్టార్ డైరెక్ట‌ర్‌తో తీయాల‌ని మెగా క్యాంప్ ఆలోచ‌న‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -