Tuesday, April 23, 2024
- Advertisement -

కమల్ హాసన్ విక్రమ్ విడుదల తేదీ

- Advertisement -

కోలీవుడ్ హీరో కమల్ హాసన్, సక్సెస్‌ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది. విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. విక్రమ్ జూన్ 3న థియేటర్లలోకి రానున్నారు.

ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా “విక్రమ్” కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని కమల్ హాసన్ ప్రకటించారు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ త్రయాన్ని శక్తివంతమైన పాత్రలలో చూపించే మేకింగ్ గ్లింప్ను కూడా వారు ఆవిష్కరించారు. విజయ్ సేతుపతి మెయిన్ విలన్గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.

కమల్ హాసన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్,శివాని నారాయణన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -