- Advertisement -

కమల్ తన ఆలోచనలను మొదటపంచుకొనేది ఆమెతోనే!

- Advertisement -

వెటరన్ యాక్టర్ కమల్ హాసన్… వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కలిగిన  ఈ హీరోకు చాలా మంది స్త్రీలతోనే సాన్నిహిత్యం ఉంది. రెండు పెళ్లిళ్లు అయ్యాయి.. వారిద్దరికీ విడాకులు ఇచ్చాడు. రెండోభార్య సారికకు ఇద్దరు అమ్మాయిలు. వాళ్లిద్దరూ ప్రస్తుతం నటీమణులుగారాణించే పనిలో ఉన్నారు. మరి ఈ లేటు వయసులో కమల్ కు తోడుగా ఉంటోంది గౌతమి. కమల్ తో పాటు చాలా సినిమాల్లో నటించిన నేపథ్యం ఉన్న ఈ నటి వైవాహిక జీవితం విడాకుల నేపథ్యంలో కమల్ తో సహజీవనం చేస్తోంది.

వీరు చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఈ విషయంలో దాపరికాలు ఏమీలేవు. అటు కమల్ కూతుర్లు, గౌతమి తొలి వివాహ ఫలితం అయిన కూతురు కూడా వీళ్లిద్దరి బంధాన్నీ సమర్థిస్తున్నారు. వారికి ఇష్టమైనట్టుగా వారుజీవించడంతో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని వీళ్లంతా స్పష్టం చేశారు. అటు సారిక కూడా వేరే వ్యక్తితో కలిసి ఉంటోంది.

ఇలాంటి నేపథ్యంలో తెలుగమ్మాయి గౌతమిపై తన ప్రేమను చాటుకొన్నాడు కమల్. ప్రస్తుతం ‘ఉత్తమ విలన్’ సినిమా ప్రచారంలో భాగంగా తెలుగు గడ్డపైహల్ చల్ చేస్తున్న కమల్ గౌతమితో బంధం గురించి ప్రస్తావించాడు. తను తన ప్రతి ఆలోచననూ గౌతమితో షేర్ చేసుకొంటానని కమల్ చెప్పాడు. తామిద్దరూ చాలా ఆనందంగా లివిన్ రిలేషన్ షిప్ ను గడిపేస్తున్నట్టుగా కమల్ ధ్రువీకరించాడు. ఇటీవల ఉత్తమవిలన్ తెలుగు ఆడియో విడుదల వేడుకకు కూడా గౌతమి ప్రత్యేక అతిధిగా హాజరైన విషయం తెలిసిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -