Monday, May 20, 2024
- Advertisement -

ఆ రాజకీయ వేత్తకి అనుమానం ఎక్కువ

- Advertisement -

ఔను ఇది అక్షరాల నిజం… ఎప్పుడు కార్యకర్తలు.. ప్రజల కష్టాలు… కోట్ల కట్టల(నోట్ల కట్టల) లెక్కలతో బిజీగాఉండే ఆ రాజకీయ వేత్తకి అనుమానం అనే జబ్బు కొత్తగా పట్టుకుంది.

అది రోజు రోజుకి ముదిరింది. అది ఎవరి మీదనో కాదు తను మూడు ముళ్ళు… ఏడు అడుగులు వేసి పెళ్ళి చేసుకున్న భార్య మీద.. ఇపుడు ఈ అనుమానాన్ని నిజం చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించాడు….

 ఆ మద్యన వచ్చిన మన్మధుడు సినిమాలో మన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు… అసలు ఎదుట వాళ్ళు ఏం అనుకుంటున్నారు అని ఆలోచించి… ధర్మవరం గారు ఒక మిషన్ కనిపెట్టాడు. అది ప్రయోగిద్దాం అనుకున్నాడు… కాని అది సినిమా కదా బయట దొరుకుతుందో లేదో అని try చేశాడు. P.A ని అడిగాడు. ఎందుకు సార్ అన్నాడు. ఏం లేదురా అది మన ఆపోజిట్ వాళ్ళ ఇంట్లో ఫిట్ చేద్దాం .. అపుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్న మనకు ఈజీగా తెలుస్తుంది అన్నాడు.. ok అని ఆ P.A మార్కెట్‌లో try చేశాడు. అది దొరకలేదు. 

కొద్దిరోజుల తర్వాత తన భార్య వ్యవహారం ఇంకా ఎక్కువవుతుంది. ఒక రోజు పేపర్‌లో చదివాడు. మనకు సంబందించిన వాళ్ళ్ళు mobile లో ఒక సాఫ్ట్‌వేర్‌ని install చేస్తే వాళ్ళు ఎవరితో ఏం మాట్లాడినా అది మన call లో వినొచ్చు అని.. అది కూడా try చేశాడు. అది కూడా కుదరలేదు. ఎన్నో రకాలుగా ఆలోచనలు బుర్రలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒక ఆలోచన మన వాడికి నచ్చింది. అంతే అది అమలు చేశాడు. తన భార్య దగ్గరికి వెళ్ళాడు… మనం outdoor వెళ్దాం అన్నాడు. ఎడారిలో A/C గాలి వీచినట్లు అనిపించింది అమెకి.. ఎందుకంటే తన boy friend గోవాలో ఉన్నాడు. తనని చూడాలని ఉంది.. అని ఎలాగో అలాగా గోవాకి రావొచ్చు కదా బంగారం అన్నాడు. 

గంట క్రితం ఫోన్‌లో  తన భర్త  outdoor అనగానే గోవాకి వెళ్దాం అంది. టక్కున ok అన్నాడు. కాని మన ఇద్దరం మాత్రమే వెళ్దాం అన్నాడు. మరి పాప ఎలా అంది. పర్లేదు అమ్మ చూసుకుంటుంది అన్నాడు. ok అనుకుని గోవాకి వెళ్ళారు. ఒక పూట అక్కడ ఉన్నారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆ గోవా hotel లొ కెమెరా  fit చేశాడు.   Urgent phone వచ్చింది నేను Hyd కి వెల్తున్నాను, మళ్ళీ  రేపు morning వస్తాను అని హడావిడిగా Hyd కి బయలుదేరాడు. ఆ రాజకీయ వేత్త గేట్లు ఎత్తాకా వాటర్ రాకుండా ఉంటుందా… వేసవిలో వెన్నెల రాకుండా ఉంటుందా.. అదే విదంగా.. తన boy friend ఆ హోటల్‌ లోకి రానే వచ్చాడు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో Door bell రింగ్ అయింది.. 

ఆమె వెళ్ళి తీసింది గుండె వెయ్యి ముక్కలు అయ్యింది… ఆవేశంతో వచ్చిన ఆ రాజకీయ వేత్త గుండె కూడా కోటి ముక్కలైంది. ఆ రూంలో తన వైఫ్‌తో ఉన్నది.. అక్షరాల తన P.A. ఇద్దరిని చితకబాదాడు…. చంపేవరకు వెళ్ళాడు. కాని ఆ P.A ఒక్క నిమిషం అని తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌లో కొన్ని సీన్స్ చూపించాడు. అది తను ఎవరెవరితో గడిపినవి ఎక్కడ ఎన్ని అన్యాయమైన పనులు చేసినవి… మొత్తం చిట్టా అందులో ఉంది. ఇక చేసేది ఏమీ లేక ఆ రాజకీయ వేత్త Hyd కి వచ్చేశాడు. విడాకులకు అప్లై చేద్దామనే అలోచనలో ఉన్నాడు. చూద్దాం ఇంకొన్ని నెలల్లో ఏం జరుగుతుందో…… 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -