Friday, May 17, 2024
- Advertisement -

కమల్ కు అంతర్జాతీయ పురస్కారం

- Advertisement -

ఐదు దశాబ్దాల పాటు తన నటనతో దక్షిణాది రాష్ట్రాల వారిని, దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన నటుడు కమల్ హాసన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో నటన అంటే ఇదీ అని చూపించిన కమల్ హాసన్ ను ఫ్రాన్స్ చిత్ర పరిశ్రమ అరుదైన పురస్కారంతో సత్కరించింది.

భారత దేశ సినీ పరిశ్రమకు కమల్ చేసిన సేవలకు గుర్తుగా ఫ్రాన్స్ లోని హెన్రీ లాంగ్లోయిస్ అవార్డు సంస్ధ కమల్ కు లాంగ్లయిస్ స్మారక పురస్కారాన్ని అందించింది. లాంగ్లోయిస్ ఫ్రాన్స్ లో ప్రముఖ సినీ చరిత్ర కారుడు.

1977 సంవత్సరంలో లాంగ్లోయిస్ కన్నుమూసిన తర్వాత ఆయన పేరు మీద ప్రతి ఏటా అవార్డును ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ అవార్డును కమల్ హాసన్ కు ఇచ్చారు. తన గురువు అనంత్ ద్వారా లాంగ్లోయిస్ గురించి తనకు తెలిసిందని ఈ సందర్భంగా కమల్ హాసన్ అన్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -