Tuesday, May 21, 2024
- Advertisement -

పవన్‌కల్యాణ్‌ రెమ్యునేషన్

- Advertisement -

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 8న సర్దార్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ చిత్రం కోసం పవన్ ఎంత రెమ్యునేషన్ తీసుకున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది.

అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం పవన్ …33 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఇప్పటివరకూ ఏ తెలుగు హీరో తీసుకోలేదు. 

ఈ చిత్రంలో కాజల్‌ తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. 2012లో విడుదలై విజయం సాధించిన ‘గబ్బర్‌సింగ్‌’ చిత్రానికి ఫ్రాంచైజ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

{youtube}v=kIuKtcJm41s{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -