రాఘవ లారెన్స్ అంటే ఒకప్పుడు ఆయన వేసిన డ్యాన్స్‌లు గుర్తుకు వచ్చేవి. కాని ఇప్పుడు ఆయన నటించిన ముని సీక్వెల్స్ గుర్తకు వస్తున్నాయి. అంతలా ఆయన ఈ సీక్వెల్స్‌తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ముని, కంచనా,గంగా సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టడంతోపాటు, బాగా నవ్వించాడు కూడా. అందుకే ఈ సినిమాలు అంతటి ఘన విజయం సాధించాయి. తాజాగా ఈ సినిమాకు మరో సీక్వెల్‌ను రెడీ చేశారు లారెన్స్.
కాంచన 3 పేరుతోయ తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రేక్షకులను ముందుకు తీసుకురాబోతున్నాడు లారెన్స్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశాడు లారెన్స్. ఏప్రిల్ 18న కాంచన 3 సినిమా తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ చేయనున్నాడు లారెన్స్. ఓవియా, వేదిక సినిమాలో హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్‌పై ఎక్కువ శ్రద్ద పెట్టాడు లారెన్స్. ఈ సినిమాను లారెన్స్ తో పాటు కళానిధి మారన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
- Advertisement -
విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్న ‘కాంచన -3’
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -