వైష్ణవ్ తేజ్ సెకండ్ మూవీ వచ్చేస్తోంది.. విడుదల ఎప్పుడంటే..!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరో వైష్ణవ తేజ్. తన తొలి సినిమాతోనే గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్. ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ ఫీట్ సాధించిన మరో డెబ్యూ హీరో ఎవరూ లేరు. ఒక్క సినిమాతోనే మెగా అభిమానులకు ఎంతో దగ్గరయ్యాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం వైష్ణవ్ రెండు సినిమాలు చేస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ, తమిళ్ డైరెక్టర్ గిరిశయ్య దర్శకత్వంలో ఇంకో మూవీ చేస్తున్నాడు. క్రిష్ తో చేస్తున్న సినిమా ఇప్పటికే ఆల్మోస్ట్ పూర్తయింది. ఇందులో వైష్ణవ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ మొత్తం వికారాబాద్ అటవీ ప్రాంతంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేందుకు మూవీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారని సమాచారం.

- Advertisement -

దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ మూవీని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే అదే డేట్ లో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న స ఆర్ఆర్ఆర్ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ఇదివరకే మేకర్స్ ప్రకటించారు. ఓ పాన్ ఇండియా సినిమా, ఓ అగ్ర హీరో నటిస్తున్న సినిమాల మధ్య వైష్ణవ్ సినిమా రానుంది. ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ పెట్టాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Also Read: ఆర్ఆర్ఆర్ కు పోటీగా అఖండ.. రిస్క్ వద్దంటున్న అభిమానులు..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -