బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక.ఝాన్సీ లక్ష్మీబాయి జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. ఎన్నో వివాదాల నడుమ సాగిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకుడిగా వ్యవహరించి ఆ తరువాత తప్పుకోవడంతో, మిగిలిన భాగానికి కంగనానే దర్శకత్వ బాధ్యతను వహించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్.ఝాన్సీ లక్ష్మీబాయిగా కంగనా రనౌత్ ట్రైలర్‌లో బాగానే మెప్పించింది.
యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం,యుద్ధ విద్యలో ఝాన్సీ లక్ష్మీబాయి ఆరితేరడం .. గుర్రపుస్వారిలో నైపుణ్యాన్ని కనబరచడం .. వివాహం .. ఆంగ్లేయ సైన్యంపై విరుచుకు పడటం .. భర్తను కోల్పోవడం .. వంటి ఘట్టాలకి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్‌ను చూస్తుంటే సినిమాను భారీగానే నిర్మించినట్లు తెలుస్తుంది.ఇక సినిమాను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 25న విడుదల చేయనున్నారు.
- 36 ఏళ్లలో రెండోసారి..బంగ్లా అద్భుతం
- ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక
- విజయ్ బాటలో చంద్రబాబు?
- ఆపరేషన్ తెలంగాణ…బీజేపీ ఫోకస్!
- బాలకృష్ణ NBK111.. సెట్ లోకి కాజల్ అగర్వాల్!
