Wednesday, May 15, 2024
- Advertisement -

స్టార్ హీరోయిన్స్ కి షాక్ ఇస్తున్న కంగన రనౌత్

- Advertisement -

ఏక్ నిరంజన్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రోమాన్స్ చేసిన భామ గుర్తు ఉందా? ఆ భామే కంగన రనౌత్.

ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో అందం, అభినయంలతో ముందుకు దూసుకుపోతూ దీపిక ప్రియాంకచోప్రా వంటి స్టార్స్ కే షాక్ ఇస్తోంది. క్వీన్ సినిమాలో కంగన నటనకు బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. అయితే ఇప్పుడు ఆమె తాజా సినిమా కోసం ఏకంగా 11 కోట్లను డిమాండ్ చేసిందట. 

ఈ వార్త బాలీవుడ్ లో హాల్ చల్ చేస్తున్న నేపధ్యంలో మీడియా వారు ఈ విషయం గురించి కంగన ని అడిగారట. దీంతో కంగన నదురు బెదురు లేకుండా పాత్ర నచ్చినప్పుడు అందులో లీనమై నటించినప్పుడు డిమాండ్ చేస్తే తప్పేమిటని ఎదురు ప్రశ్నించింది. కంగన సమాధానం విన్న మీడియా వారు అమ్మ కంగన అని నోరు వెల్లబెట్టారు. 

బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అయిన దీపిక ప్రియాంకచోప్రా వంటి వారే  ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేయటానికి సాహసం చేయటం లేదు. కంగన మాత్రం ఒక్కసారిగా అంత పెద్ద మొత్తం డిమాండ్ చేయటం గురించి బాలీవుడ్ లో జోరుగా చర్చ జరుగుతుంది. ప్ర‌స్తుతం కంగ‌న, ఇమ్రాన్‌ఖాన్ జంట‌గా న‌టించిన‌ ‘క‌ట్టిబ‌ట్టి’ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -