Saturday, May 4, 2024
- Advertisement -

ఉపేంద్ర ఎంత ప‌ని చేశాడో చూశారా

- Advertisement -

ఇవ్వాళ రామ్ గోపాల్ వ‌ర్మ… ట్విట్ట‌ర్ పిట్ట వ‌చ్చాక అత‌ను చేసే ప‌నుల‌తో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు గాని… వ‌ర్మ రాక‌ముందే పేప‌ర్ మాత్ర‌మే లీడింగ్ లో ఉన్న టైమ్లోనే త‌న చేత‌ల‌తో అంత‌కుమించిన రాద్ధాంతాలు సృష్టించిన వాడు సౌత్ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉపేంద్ర ఒక్క‌డే. తాను చేసే సినిమాలు, టైటిల్స్ ,సాంగ్స్ షూట్లు విష‌య‌కంలో… మ‌నం స‌రిగా గమనిస్తే ఎంతో వండ‌ర్స్ క‌నిపిస్తాయి..

ష్, ఎ, రా, హెచ్ టు ఓ ఇలా డిఫరెంటుగా ఉన్నాయి. సినిమాలతోనే కాకుండా… అతి త్వరలో ఉపేంద్ర తన ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి టైటిల్ కూడా ఎంతో విచిత్రంగా పెట్టాడు. ‘ఇదన్నా ఓడ్‌బేడి’ అనే కన్నడ టైటిల్ తో ఈ పుస్తకం రిలీజ్ చేయబోతున్నారు. అంటే ‘డోంట్ రీడ్ దిస్’ (దీన్ని చదవొద్దు) అని అర్థం. త్వరలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఉపేంద్ర ప్లాన్ చేస్తున్నాడు.

ఈ పుస్తకంలో ఏముంటుంది అని స‌ర‌దాగా తీసిపారేయ‌డానికి లేదు. ఎందుకంటే ఉపేంద్ర జీవితంలోని ఎన్నో ముఖ్య ఘట్టాలను ఫోకస్ చేస్తూ ఈ ఆటోబయోగ్రఫీ ఉండబోతోంది. ఉపేంద్ర రాజకీయాల్లో కీ రోల్ పోషించ‌బోతున్నాడ‌ని అనుకుంటోన్న నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఫ్యూచర్‌కు హెల్ప్ అయ్యేలా ఈ పుస్తకం ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.

ఇటీవలే ‘కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష’ పేరుతో సొంతగా రాజకీయ పార్టీని స్థాపించారు.పొలిటికల్ మైలేజ్ లో భాగంగా…. తాను రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాని…త్వ‌ర‌లోనే ఉపేంద్ర తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని లాంచ్ చేయడం చర్చనీయాంశం అయింది. పొలిటికల్ మైలేజ్ కోసమే ఉపేంద్ర ఇపుడు ఈ పుస్తకాన్ని లాంచ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -