Saturday, May 18, 2024
- Advertisement -

చైనా మ‌రుగుదొడ్ల‌కు మ‌హ‌ర్ధ‌శ‌

- Advertisement -

చైనా వాడి బుర్ర‌లోకి ఏదైనా ఆలోచ‌న రావ‌డం పాపం…ఏం చేసేస్తారో వారికే తెలియ‌దు.దేనికి వెనుకాడ‌రు. పాకిస్థాన్ వ‌చ్చి డ్యామ్ క‌ట్ట‌డం.శ్రీలంక వెళ్లి నౌకా నిర్మాణం చేప‌ట్ట‌డం ..ఇంకెక్క‌డికో వెళ్లి ఎవ‌రినో శాటిస్పై చేయ‌డం లాంటివి చైనాకు ఎందుకోక‌లిసొచ్చే అంశాలుగా భావిస్తుంటారు. ప్ర‌స్తుతానికి ఆ దేశం ఆర్ధిక ప‌త‌నావ‌స్థ‌లో ఉన్న‌ప్ప‌టికీ భ‌విషత్ లో మంచి ఫ‌లితాల‌ను ఇస్తు9ంద‌ని న‌మ్మే ఇలాంటివి చేస్తున్నామంటున్నారు. తాజాగా త‌మ దేశానికొచ్చే ప‌ర్యాట‌కుకోసం భారీ స్థాయిలో టాయిలెట్ల‌ను ఆధునీక‌రిస్తున్నారు.

మోడ్ర‌నైజ్డ్ టాయిలెట్స్ అంటే ఏదో స‌ర‌దాగా కానిచ్చేసే టాయిలెట్స్ కాదండోయ్ .అది ఓ రేంజ్ లో ఉంటుంద‌ట‌. స‌ర్వం ఆ టాయిలెట్స్ లో చేసుకునేలా రోబోటిక్స్ కాన్సెప్ట్ ను కూడా కొన్ని చోట్ల వాడే ఉద్దేశ్యంతో ఉన్నారు. ప్రపంచ పర్యాటక సంస్థ గణాంకాల ప్రకారం అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించిన మొద‌టి నాలుగు దేశాల్లో చైనాకు చోటు దక్కింది. గత ఏడాది 5.93 కోట్ల మంది చైనాలో పర్యటించారు. వివిధ పర్యాటక ప్రదేశాల్లో ఈ అక్టోబరు నాటికి …68 వేల టాయిలెట్లను నిర్మించింది. 2020 వరకు ఎంత‌లేద‌న్నా… ఇంకో 64 వేల టాయిలెట్లను ఆధునీకరించాలని సంకల్పించారు.ఈ టాయిలెట్‌ విప్లవం పర్యాటక ప్రాంతాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ విస్తరిస్తోందని చైనా మీడియా పేర్కొంది. మరుగుదొడ్లతోపాటు రోడ్ల వంటి ఇతర సదుపాయాలనూ విస్తరిస్తున్నారు.ఏ విష‌యంలోను త‌మ దేశం ప్ర‌పంచ మేటి దేశాల ముందు త‌క్కువ కాద‌ని చెప్ప‌డం కోస‌మే చైనా ఇలాంటి ప్ర‌య‌త్నం చేస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -