అభిమానం అనేది హద్దులలో ఉంటే ఎవ్వరికైన బాగుంటుంది. అయితే ఈ రోజులలో అభిమానం పేరుతో పిచ్చి వేషాలు ఎక్కువైయ్యాయనే చెప్పాలి. ఒక హీరో పై మరో హీరో అభిమానలు కామెంట్స్ చేయడం సర్వసాధారణంగా మారింది. అయితే హీరోల కోసం ఆత్మహత్య చేసుకునేంత వరకు వెళ్లింది అభిమానం. తాజాగా తన అభిమాన హీరో కోసం ఓ వ్యక్తి ఏకంగా పెట్రోల్ పోసుకుని ఆత్మహతయత్నం చేసుకున్నాడు. పూర్తి వివరాల్లో వెళ్తే…బెంగుళూరు రూరల్ నెలమంగళ తాలుకూశాంతినగర్ కి చెందిన రవి కన్నడ స్టార్ హీరో యష్‌కు వీరాభిమాని.
ఈరోజు యష్ పుట్టిన రోజు కావడంతో , ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడానికి యష్ ఇంటికి వెళ్లాడు. అయితే సెక్యురిటీ లోపలికి అనుమతి ఇవ్వలేదని పెట్రోలు పోసుకొని సజీవ దహనానికి యత్నించాడు. సెక్యురిటీ సిబ్బంది రవిని లోపలకి అనుమతించకపోవడంతో కాసేపు వేచి చూశాడు రవి. ఎంతసేపటికీ తనను లోపాలకి పంపకపోవడంతో మధ్యాహ్నం అక్కడే పెట్రోల్ పోసుకొని సజీవ దహనానికి ప్రయత్నించాడు. కాలిన గాయాలతో ఉన్న రవిని ఆసుపత్రికి తరలించారు అభిమానులు.
- Advertisement -
స్టార్ హీరో యష్ కోసం ఆత్మహత్యయత్నం చేసుకున్న అభిమాని
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -