తమిళ హీరో కార్తికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు కార్తి. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు కార్తి. ఖాకీ, చినబాబు సినిమాలతో హిట్ కొట్టిన కార్తి తన తరువాత సినిమాను లైన్లో పెట్టాడు. కార్తి తాజాగా నటించిన చిత్రం దేవ్. ఇప్పటికే విడుదల అయిన టీజర్ అందరిని ఆకట్టుకోగా…తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్. యాక్షన్ ,ఎమోషన్ ,రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. ఇక ట్రైలర్‌ను చూస్తుంటే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనిపిస్తోంది. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఖాకీ సినిమాలో కార్తి,రకుల్ కలిసి నటించారు. ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా హిట్‌గా నిలుస్తుందని భావిస్తోంది రకుల్. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్‌లు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక సినిమాను ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
- Advertisement -
ట్రైలర్‌ను చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -