Saturday, April 27, 2024
- Advertisement -

గుంటూరు కారంలో రమ్యకృష్ణ..!

- Advertisement -

అలనాటి అందాల హీరోయిన్లలో ఒకరు రమ్యకృష్ణ. వయసు మీద పడటంతో తన ఏజ్‌కు తగ్గ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు రమ్యకృష్ణ. బాహుబలిలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ అద్భుత నటన కనబర్చారు.ఈ సినిమా తర్వాత అమ్మ,అత్త పాత్రల్లో మెప్పిస్తున్న రమ్యకృష్ణ తాజాగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారంలో మెరిశారు.

మహేష్ బాబు తల్లి పాత్రలో మెప్పించారు రమ్యకృష్ణ. ఇక ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. మహేష్ బాబుకు జోడీగా శ్రీలీల నటించగా బొమ్మ బాస్టర్‌ అని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

గతంలో మహేష్ బాబు ఎస్ జే సూర్య కాంబినేషన్ లో వచ్చిన నాని సినిమాలో కూడా రమ్యకృష్ణ నటించారు. నాని సినిమాలో రమ్య కృష్ణ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబుకు తల్లిగా నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -