Sunday, May 5, 2024
- Advertisement -

యువ హీరో ఆశలన్నీ ఆ సినిమా పైనే

- Advertisement -

RX 100 సినిమా తో పాపులర్ అయిన యువ హీరో కార్తికేయ. RX 100 తరువాత వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అన్నిటిని ఒప్పుకోకుండా చాలా ఓపికగా మంచి మంచి స్క్రిప్టులు ఏరి కోరి మరి చేస్తున్నాడు కార్తికేయ. ఇప్పటికే రెండో సినిమా హిప్పీ విడుదల కాగా మూడో సినిమా గుణ 369 షూటింగ్ తో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు ఈ హీరో. ఈ చిత్రానికి సంబదించిన షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.

సోషల్ మీడియా లో వస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా ఒంగోలు జిల్లా బ్యాక్ డ్రాప్ మీద నడవనున్నది అట. ఒంగోలు జిల్లా కి సంబంధించిన అర్జున్ జంధ్యాల అనే యువకుడి జీవితం లో జరిగిన ఘటనల ఆదరణ గా చిత్ర యూనిట్ ఈ సినిమా ని చేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది. దాదాపుగా డెబ్బై శాతం సినిమా షూటింగ్ ఒంగోలు పరిసర ప్రాంతం లో జరుగుతుంది అట. స్ప్రింట్ ఫిలింస్ మరియు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ పతాకాలు పై తిరుమల రెడ్డి మరియు అనిల్ కడియాల సంయుక్తం గా ఈ సినిమా నీ నిర్మిస్తున్నారు. కార్తికేయ ఈ సినిమా పై ఎనలేని విశ్వాసం తో ఉన్నాడు. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -