Tuesday, May 6, 2025
- Advertisement -

అతడి రెండో సినిమా కూడా బోల్డ్ సినిమా నే

- Advertisement -

కార్తికేయ ప్రస్తుతం తన రెండో చిత్రం హిప్పీ ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్నాడు. మొదటి చిత్రం RX100 తో అందరిని మెప్పించిన ఈ హీరో ఇప్పుడు ఈ రెండో చిత్రం తో కూడా విజయాన్ని కంప్లీట్ చేయాలనే ఉదేశ్యం తో ఉన్నాడు. ఈ సినిమా అధికారికం గా ప్రకటించిన దగ్గర నుండి పోస్టర్స్, ట్రైలర్స్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రొమాంటిక్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ ని క్లియర్ చేసుకుంది. అయితే సెన్సార్ బోర్డు మెంబర్స్ ఈ సినిమా కి A సర్టిఫికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది.. అసలు సినిమా లో ఆ ఛాయలే ఎక్కువ కనిపించలేదు, దీనికి కూడా A సర్టిఫికెట్ ఇవ్వడం అంటే కార్తికేయ రెండో చిత్రం తో కూడా బోల్డ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడా అనే కన్ఫ్యూషన్ అందరికీ వస్తుంది.

అయితే ఈ సినిమా కూడా కొన్ని యథార్థ సంఘటనల మీద ఆధారపడి తీయబడింది అని ఫిలిం నగర్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా లో కార్తికేయ సరసన సూర్యవంశీ మరియు జాజ్బా సింగ్ హీరోయిన్లు గా నటిస్తున్నారు. టీ ఎన్ కృష్ణ దర్శకుడి గా ఈ చిత్రం వీ క్రియేషన్స్ పాతకం పై కలైపులి థాను చే నిర్మింపబడుతుంది. ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం లో కూడా ఒకేసారి విడుదల అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -