Sunday, April 28, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కృష్ణ మద్య విభేదాలు ఆ స్థాయిలో ఉండేవా?

- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ అనగానే సంచలనాలకు మారు పేరు. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలతో తెలుగు సినిమా ఖ్యాతిని శీకరాగ్రాన నిలిపిన ఘటన ఒక్క సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది. ఆ టైమ్ లో సీనియర్ ఎన్ టి రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి హేమాహేమీలు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయాన ఆ ఇద్దరి అగ్రహీరోలను సైతం వెనక్కి నెట్టేలా తిరుగులేని ఏమేజ్ సొంతం చేసుకున్నారు. మొదటి కలర్ మూవీ, మొదటి 70 ఏం ఏం, మొదటి ఈస్ట్ మన్ కలర్ మూవీ, మొదటి డీటీఎస్ ఇలా ప్రతి టెక్నాలజీని తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘటన కృష్ణ దే. ఇదిలా ఉంచితే ఆ టైమ్ లో కృష్ణ, ఎన్ టి రామారావు మద్య ఉండే పోరు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉండేవి.

1974 లో వచ్చిన అల్లూరి సీతారామరాజు మూవీ కృష్ణ కెరియర్ లోనే ఒక ప్రభంజనం. ఈ మూవీ అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అయితే మొదట్లో ఈ మూవీని రామారావు చేయాలని భావించడట. కొంతవరకూ షూటింగ్ కు జరుపుకోగా.. కృష్ణ కూడా అల్లూరి సీతారామరాజు కథాంశంతో మూవీ తీస్తున్నాడని సమాచారం అందుకున్న ఎన్ టి రామారావు.. కృష్ణ ను మూవీ విరమించుకోవాలని కోరాడట. అందుకు కృష్ణ నిరాకరించడంతో అప్పటి నుంచి కృష్ణ, ఎన్టీఆర్ మద్య విభేదాలు మొదలయ్యాయని ఇండస్ట్రీ వర్గాల పెద్దలు చెబుతుంటారు.

ఇక ఆ తరువాత కృష్ణ ఎన్టీఆర్ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ వారి సినిమాలను రిలీజ్ చేసే వారట. కృష్ణ నటించిన ” సింహాగర్జన ” కు పోటీగా ఎన్టీఆర్ ” సింహబలుడు ” అనే మూవీని రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ దానవీర శూర కర్ణ మూవీకి పోటీగా కృష్ణ ” కురుక్షేత్రం ” మూవీని రేస్ లో నిలిపారు. ఈ విధంగా నడిచిన కృష్ణ ఎన్టీఆర్ మద్య పోటీ.. పరస్పర విభేదాల వరకు కూడా దారి తీసింది. ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం పై కూడా కృష్ణ తన సినిమాల ద్వారా సెటైర్స్ వేసేవాడట. కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే.. ఎన్టీఆర్ ను ఎదుర్కోవడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లోకి కృష్ణ కు ఆహ్వానం పలికారు.

ఆ తరువాత తెలుగుదేశం చర్యలపై వ్యంగ్యంగా, ముఖ్యంగా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేస్తూ కృష్ణ చేసిన ” మండలాధీశుడు ” మూవీ అప్పట్లో ఎన్టీఆర్.. కృష్ణ మద్య ఉండే విభేదాలకు అద్దం పడుతుంది. ఇలా ఇద్దరు ఆగ్రా హీరోల మద్య సాగిన విభేదాలు..వారి అభిమానుల మద్య కూడా తీవ్రమైన గొడవలకు దారి తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వీరిద్దరు కలిసి స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు, వగలమారి భర్తలు వంటి సినిమాల్లో నటించారు.

ఇవి కూడా చదవండి

చిరు బాలయ్యకు స్ట్రోక్ ఇస్తోన్న తలపతి విజయ్ ?

తెలుగు సినీ చరిత్రలో చెరిగిపోని సంతకం !

ఒకే దారిలో రాంచరణ్, అల్లు అర్జున్.. నిరాశలో ఫ్యాన్స్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -