Sunday, May 12, 2024
- Advertisement -

ఒక మెగా హీరో కి ఫ్లాప్, మరి శిరీష్ సంగతి ఏంటి?

- Advertisement -

చూడబోతే ప్లాప్ దర్శకులందరినీ చేర్చుకొని వాళ్ళతో హిట్ లు అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు గీతా ఆర్ట్స్ ప్రతినిధులు. ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాల, బొమ్మరిల్లు భాస్కర్ ల తో సినిమా లు చేయాలనీ చూస్తున్న వీరు ఇప్పుడు కరుణాకరన్ తో కూడా ఒక సినిమా ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ సాయి ధరమ్ తో తేజ్ ఐ లవ్ యు అనే సినిమా తో ప్లాప్ ఇచ్చిన కరుణాకరన్ ఇప్పుడు శిరీష్ తో జత కట్టాలని చూస్తున్నాడట. ఎప్పుడో అల్లు అరవింద్ కి ఒక కథ వినిపించాడట ఈ దర్శకుడు. ఆ కథ కి సానబెట్టి శిరీష్ హీరోగా ప్రాజెక్ట్ ప్రకటించాలి అని చూస్తున్నాడు అల్లు అరవింద్.

అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే క్లారిటీ లేదు. ఇటీవలే అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ సినిమా ఘోరంగా విఫలమవడం తో ఈ సారి వచ్చే సినిమా పక్క స్క్రిప్ట్ పూర్తి అయ్యాకే సెట్స్ మీద కి తీసుకొని వెళ్ళాలి అనే ఆలోచన లో ఉన్నాడట శిరీష్. కరుణాకరన్ కూడా ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి చేయకపోవడం తో తన కి కావాల్సిన సమయం ఇచ్చి ఈ సినిమా ని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు గీతా ఆర్ట్స్ ప్రతినిధులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -