Sunday, May 19, 2024
- Advertisement -

కొత్త‌జిల్లాల ఏర్పాటుపై జ‌గ‌న్ క‌స‌ర‌త్తు… మొత్తం ఎన్ని జిల్లాలంటే…?

- Advertisement -

రేపు 30న జ‌గ‌న్ ఏపీ సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన వెంట‌నె జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్ని వ్య‌వ‌స్థ‌ల్లో ప్ర‌క్షాళ‌న‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇక జ‌గ‌న్ మేనిఫెస్టోలో ప్రకటించిన ‘నవరత్నాల’ అమలుకు సంబంధించే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉంన్న‌ట్లు సమాచారం.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప్ర‌తి పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ను ఒక జిల్లాగా చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఆదిశ‌గా అడుగులు వేస్తున్నారు.నవర్నాల పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరులు ఏమేరకు సహకరిస్తాయన్న దానిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్ అజేయ కల్లంతో జగన్ సమీక్షించినట్టు స‌మాచారం.

ఏపీలో ప్రస్తుతం 13 జిల్లాలున్నాయి. వైఎస్ జగన్… కొత్తగా 12 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తం క‌లుపుకుంటె 25 జిల్లాలు కానున్నాయి. వైఎస్ జగన్ తన ఆసక్తి కొద్దీ ఓ గిరిజన జిల్లా కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు. అది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మధ్య ఏజెన్సీలో ఏర్పాటవుతుందని సమాచారం. అందు వ‌ల్ల జిల్లాల సంఖ్య 26కు పెర‌గ‌నుంది.

వైఎస్ జగన్ గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యగానే… ఆల్రెడీ సిద్ధంగా ఉంచిన రెవెన్యూ శాఖ ఫైల్‌ను అధికారులు ఆయన ముందు ఉంచుతారు.జూన్ 3 నుంచి శాఖల వారీగా సమీక్షించనున్న జగన్, ఆరో తేదీన రాజధానిపై సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం 7వ తేదీన మంత్రి వర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. జగన్ కొత్త జిల్లా ఫైల్‌పై సంతకాలు పెట్టి… కేంద్రానికి పంపబోతున్నారు.

ఇక కొత్తగా రానున్న జిల్లాలను పరిశీలిస్తే, అరకు (విశాఖ జిల్లా), అనకాపల్లి (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా), రాజంపేట (కడప జిల్లా).

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -