Wednesday, May 14, 2025
- Advertisement -

‘కాష్మోరా’ మూవీ రివ్యూ

- Advertisement -
kashmora movie review

తమిళ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా ఈ రోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైంది. హీరోయిన్స్ గా నయనతార, శ్రీదివ్య ముఖ్య పాత్రల్లో నటించగా.. తమిళ దర్శకుడు గోకుల్ దర్శకత్వం వహించారు.

కార్తీ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. ‘3డీ ఫేస్ స్కాన్’ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ సినిమాకు రూ. 60 కోట్లు ఖర్చుచేశారు. మరి ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూ‌లోకి వెళ్లి చూద్దాం.

కథ:

కాష్మోరా(కార్తీ) దయ్యాలను వదిలించే ఓ వ్యక్తిగా జనాలను మాయ చేసి బాగా ఫేమస్ అయిపోతాడు. పోలీసులు, మంత్రులు సైతం సహాయం కోసం తన ఇంటికి వస్తారు. అయితే కాష్మోరా కేవలం డబ్బు కోసమే జనాలని మాయ చేసి బ్రతికుతున్నాడని నిరూపించడానికి యామినీ(శ్రీదివ్య) అనే అమ్మాయి నిర్ణయించుకుంటుంది. తన ప్లాన్ లో భాగంగా ముందుగా కాష్మోరా దగ్గర అసిస్టెంట్ గా చేరుతుంది. ఇది ఇలా ఉండగా కాష్మోరా దగ్గరకి ఒక రోజు చిదంబరం అనే వ్యక్తి వచ్చి తన బంగ్లాలో దయ్యాలున్నాయని వాటిని వదిలిస్తే కావల్సినంత డబ్బు ఇస్తానని చెబుతాడు. దీంతో కాష్మోరా ఆ బంగ్లాకు వెళతాడు. తీరా అక్కడకి వెళ్ళిన తరువాత కాష్మోరాకి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. కావాలనే తనని, తన కుటుంబాన్ని ఆ బంగ్లాకు రప్పించారని తెలుసుకుంటాడు కాష్మోరా. అసలు ఆ బంగ్లాలో ఏం జరుగుతుంది..? కాష్మోరా దగ్గర నిజంగానే దయ్యాలను వదిలించే శక్తులు ఉన్నాయా..? తన కుటుంబాన్ని కూడా ఆ బంగ్లాకు రప్పించడానికి గల కారణాలేంటి..? ఆ బంగ్లాలో కాష్మోరా తెలుసుకున్న నిజాలేంటి..? రాజనాయక్, రత్నమహాదేవి అనే రాజకుటుంబీకులకు కాష్మోరాకు ఉన్న సంబంధం ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..!

ప్లస్ పాయింట్స్ :

కార్తీ రాజనాయక్ గా, కాష్మోరాగా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. కాష్మోరాగా కామెడీ పండిస్తూనే రాజనాయక్ పాత్రలో క్రూరమైన విలన్ గా కార్తీ చేసిన నటన అందరిని ఆకటుకుంటుంది. రెండు పాత్రలకు విభిన్న వేరియేషన్స్ చూపిస్తూ సినిమాకు హైలేట్ గా నిలిచాడు కార్తీ. ఇక నయనతార రత్నమహాదేవి పాత్రలో మరోసారి అదిరగొట్టింది. అందంగా కనిపిస్తూనే పరాక్రమవంతురాలైన యువరాణిగా ఆకట్టుకుంది. 700 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనకు ప్రస్తుత పరిస్థితులను తీసుకొని దర్శకుడు గోకుల్ నడిపించిన విధానం చాలా బాగుంది. శ్రీదివ్య పాత్రకు సినిమాలో అంత ప్రాముఖ్యత లేకపోయినా.. ఉన్నంతలో మెప్పించింది. కమెడియన్ వివేక్ కార్తీ తండ్రిగా నటించి ప్రేక్షకులను తన కామెడీతో నవ్వించాడు. సినిమా కోసం వేసి సెట్స్, కార్తీ మేకప్ సూపర్బ్ గా  ఉన్నాయి. గ్రాఫిక్స్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ముఖ్యమైన మైనస్ అంటే సంగీతం అని చెప్పాలి. హర్రర్ సినిమాకు కీలకమైనదే సంగీతం. ఈ విషయంపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. పాటలు ఏమాత్రం అలరించకపోగా నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే స్థాయిలోలేదు. ఎడిటింగ్ లో కూడా చాలా తప్పులే ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ ఇంకాస్త తగ్గించి ఉంటే బాగుండేది. అక్కడక్కడా బోర్ కలిగించే సన్నివేశాలు ఉన్నాయి.

మొత్తంగా:

కార్తీ నటన పరంగా అద్భుతంగా చేసి.. ఈ సినిమా ఓ రెంజ్ లో నిలబెట్టాడు. నయనతార, శ్రీ దివ్య పర్వలేదు అనిపించారు. దర్శకుడు కూడా కథను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక్కమాటలో చెప్పలి అంటే.. ఈ సినిమా హర్రర్ తోపాటు కామెడీ అదించింది. సో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించగలదు.

రివ్యూ రేటింగ్: 3.0

{youtube}lIJsNZQFjGk{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -