Thursday, May 9, 2024
- Advertisement -

పూణ‌మ్ కౌర్‌కు… క‌త్తి ఘాటు కౌంట‌ర్…

- Advertisement -

పూనమ్ కౌర్. తెలుగు తమిళ నటి. ఆమె చిత్ర సీమలో అడుగుపెట్టక ముందు ఓ మోడల్. హైదరాబాద్ వాసి. అయితే, ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత స్థాయిలో గుర్తింపురాలేదు. అయితే ప‌వ‌న్ వీరాభిమాని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియమించ‌డంతో పూన‌మ్‌కు కాస్త ఊర‌ట ల‌భించింది.

అయితే గ‌త కొద్ది రోజులుగా క‌త్తి మ‌హేష్, ప‌వ‌న్ అభిమానుల‌కు మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా పూన‌మ్ కౌర్ వారిని ఉద్దేశించి పూన‌మ్ ప‌రోక్షంగా ఘాటు ట్వీట్‌లు చేసింది. ఇత‌రుల‌ను విమ‌ర్శించ‌డం ద్వారా డ‌బ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్త‌ములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ స‌మ‌స్య‌. ఎవ‌రో అనారోగ్యంతో బాధ‌పడుతున్నారు. బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి అత‌నికి డ‌బ్బులు డొనేట్ చేయండంటూ క‌త్తిని ప‌రోక్షంగా విమ‌ర్శించింది.

అంతే రీతిలో క‌త్తిమ‌హేష్ పూన‌మ్ కౌర్‌కు కౌంట‌ర్ ఇచ్చారు. తనపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ పూనం తీరును ఆయన ఎండగట్టారు. పవన్‌ ప్రాపకంతో ఏపీలో చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ పదవి సంపాదించి ఆయన మెప్పు కోసం తనపై ప్రేలాపనలు చేస్తున్నావని మండిపడ్డారు.

పవన్ కళ్యాణ్ రికమండేషన్ తో ఆంద్రప్రదేశ్ చేనేతవస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యావు. ఉద్యోగం,సద్యోగం, సినిమాలు లేకుండా తిరిగింది నువ్వు. కాబట్టి నీ లాయల్టీ నిరూపించుకోవడానికి నన్ను “ఫ్యాట్సు” అని పిలిస్తే, నేను నిన్ను చాలా పిలవగలను. అది నాసంస్కారం కాద‌ని హిత‌వు ప‌లికారు.

అడుక్కుని సంపాదించుకున్న పదవి మీద బ్రతుకుతున్న నువ్వా నాకు భిక్ష వేసేది? మాటలు జాగ్రత్తగా రాని. నేను నోరు తెరిస్తే నువ్వు, నీ పవన్ కళ్యాణ్ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకొండి’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -