Sunday, May 19, 2024
- Advertisement -

286 పరుగులకే ఆలౌట్ అయిన ద‌క్షిణాఫ్రికా….

- Advertisement -

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టులో భార‌త బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు. దీంతో ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 73.1 ఓవర్ల వద్ద 286 పరుగులకి ఆలౌట్ అయింది. అదిలోనే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ సౌతాఫ్రికాను డీవిల్ల‌ర్స్‌, డూప్లెసెస్ ఆదుకున్నారు.

సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్‌లో డీన్ ఎల్గర్ 0, మార్క్‌రం 5, ఆమ్లా 3, డివిల్లియర్స్ 65, ప్లెస్సిస్ 62, డి కాక్ 43, ఫిలండెర్ 23, కేశవ్ మహారాజ్ 35, రబాడా 26, స్టెయిన్ 16, మార్కెట్ 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లు తీయగా, రవి చంద్రన్ అశ్విన్ 2 తీశాడు. షమీ, బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ లభించాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -