Friday, May 17, 2024
- Advertisement -

హీరో కోసం వెంట పడుతున్న హీరోయిన్

- Advertisement -

కత్తిలాంటి ఫిగర్ కత్రినాకైఫ్ కి అర్జంట్ గా హిట్ కావాలి, కెరీర్ మొదట్లో వరుసగా పెద్ద హీరోలతో చేసిన అమ్మడు అన్నీ సూపర్ డూపర్ హిట్లే సొంతం చేసుకుంది. ప్రతీసారి పెద్ద హీరోలతో చేస్తే కెరీర్ ఎక్కువ కాలం నిలవదు అనుకున్న భామ సీనియర్స్ ని పక్కకు పెట్టి కుర్రాళ్ళతో జోడి కట్టడం మొదలుపెట్టింది. ఇది కాస్తా బెడిసికొట్టి ఇప్పుడు అమ్మడుకి వరుస ఫ్లాఫులు ఎదురయ్యేలా చేసింది.

దాంతో ప్రస్తుతం కత్రినాకైఫ్ కి ఉన్న క్రేజ్ తగ్గుమొఖం పట్టడంతో ఎలాగైనా మళ్ళీ లైమ్ లైట్ కి రావాలని ఆశపడుతున్న అమ్మడు సెక్సీ ఫోజులు ఇవ్వడం మొదలుపెట్టింది. అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వకపోవడంతో రీసెంట్ గా తను ఇంతకుముందు నటించిన సీనియర్ టాప్ హీరోలని కలవడం మొదలుపెట్టింది అమ్మడు.

అందులో భాగంగా ముందుగా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని కలిసి ఒక్క చాన్స్ ఇప్పించండి అంటూ వెంటపడుతుందట. ప్రస్తుతం షారుఖ్ ఇంతియాజ్ అలీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో మొదట అనుష్క శర్మని హీరోయిన్ గా అనుకున్నా కుదరకపోవడంతో ఆ చాన్స్ నాకు ఇప్పించమని రిక్వెస్ట్ చేసిందట. మరి షారుఖ్ చాన్స్ ఇస్తాడా లేదా అనేది తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -