Thursday, May 2, 2024
- Advertisement -

రామ్ చరణ్ కి అడ్డం పడుతున్న చిరంజీవి

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఏ ముహుర్తానా తమిళ్ బ్లాక్ బస్టర్ తనీఒరువన్ తెలుగు రీమేక్ ని చేయాలి అనుకున్నాడో కానీ మొదలుపెట్టినప్పటి నుండి ఆ సినిమా డిలే అవుతూనే ఉంది, ఈ పాటికి షూటింగ్ చివరిదశకు చేరుకోవాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు కేవలం 40% మాత్రమే పూర్తి అయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నారు. షూటింగ్ డిలేకి మొదటి కారణం చిరు 150 వ సినిమానే అంటున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మక౦గా తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం ఈ సినిమాను పక్కకు పెట్టిన రామ్ చరణ్ ఎంతకీ షూటింగ్ కి రావడం లేదట. దాంతో మిగిలిన వాళ్ళతో సీన్లు తీస్తున్న సురేందర్ రెడ్డి వాళ్లతో రామ్ చరణ్ చేయాల్సిన సీన్లన్నీ పెండింగ్ లో పెట్టాడట. అయినా రామ్ చరణ్ ఇంకా షూటింగ్ కి రాకపోవడంతో సినిమా దసరాకి రావడం కష్టమే అంటున్నారు.

చిరు సినిమా ఈ త్వరలో ప్రారంభం అవుతుండటం రామ్ చరణ్ నిర్మాత అవ్వడంతో మొదటి ప్రిఫరెన్స్ ఆ సినిమాకే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 8 ఏళ్ల తరువాత చిరు నటిస్తున్న సినిమా అవ్వడంతో తన సినిమాను త్యాగం చేశాడు రామ్ చరణ్. దాంతో ఇక దసరా రేసులో రామ్ చరణ్ ఉండటం కష్టమే అంటున్నారు. మరి రామ్ చరణ్ ఎప్పుడూ ఆ ప్రాజెక్ట్ ని రెడీ చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -