Saturday, May 18, 2024
- Advertisement -

బెజవాడలో పోటెత్తిన కౌషల్ మీద అభిమానం

- Advertisement -

జై కౌషల్, జైజై కౌశల్, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, కౌషల్ అన్న సూపర్ స్టార్. వియ్ లవ్ కౌశల్, బైయాస్డ్ యాంకర్ నానీ డౌన్ డౌన్. బిగ్ బాస్ ప్లీజ్ ఎలిమినేట్ నానీ…అంటూ బెజవాడ వీధులు హోరెత్తిపోయాయి. కౌషల్ ఆర్మీ చేపట్టిన 2కే వాక్ లో కౌషల్ మీద అభిమానం పోటెత్తింది. మహిళలు, ఉద్యోగులు, విద్యార్ధినిలు, యువకులు, పిల్లలు పెద్ద ఎత్తున ఈ 2కే వాక్ లో పాల్గొన్నారు. కౌషల్ ఫొటోలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని తమ అభిమానం చాటుకున్నారు. ఆయన ఫొటోలకు పాలాభిషేకం చేశారు. నీతిగా నిజాయతీగా ఉన్న కౌషల్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయే గోల్డెన్ మూమెంట్స్ కోసం తామంతా ఎదురు చూస్తున్నామని నినదించారు. కౌషల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అనటం మండిపడ్డారు. ఎంతిచ్చారా ? ఎవడిచ్చాడ్రా ? మాకు డబ్బులు అని నిలదీశారు. మిగతా కంటెస్టెంట్ల కుళ్లు బుద్ధులు, కపట నాటకాలు, ప్యాంపరింగులు చూడలేక, కౌషల్ ఒంటరి పోరాటాన్ని అతడి ఆత్మవిశ్వాసం, ఆటిట్యూడ్, వ్యక్తిత్వం, పోరాడేతత్వం, నీతి నిజాయతి, ముక్కుసూటితనం నచ్చి తాము అభిమానం పెంచుకున్నామని తేల్చి చెప్పారు. ఎవడు పడితే కౌషల్ ఆర్మీ పెయిడ్ ఆర్మీ గియిడ్ ఆర్మీ నోరు జారితే జాగ్రత్త అని హెచ్చరించారు. మొన్న హైదరాబాద్ 2కే వాక్ చూశాక చాలామంది నోరు మూసుకున్నారని, ఇప్పుడు బెజవాడ 2కే వాక్ చూశాక మిగతా వాళ్ల నోళ్లు మూతపడటం ఖాయమని చెప్పారు.

నానీ నోరు జాగ్రత్త. నువ్వు చేస్తే సంసారం కౌషల్ చేస్తే ఇంకోటా ? పిచ్చి నా కొడుకు అని గీతా మాధురి అంటే నీ చెవులకు వినిపించలేదా ? నీ అమ్మ మొగుడు అని గణేశ్ వాగితే నీ కళ్లకు కనపడలేదా ? కథలు @@@ అని దీప్తి సునైనా అంటే నీకు వినపడలేదా ? మాదర్ చోత్ అని అమిత్ తిట్టినప్పుడు నీ కళ్లు మూసుకుపోయాయా ? తనీష్ తిట్లు వినపడలేదా ? అంటూ కౌషల్ అభిమానులు. సిల్లీ ఫెలోస్ సినిమా ప్రమోషన్ కోసం సునీల్ అల్లరి నరేష్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు నానీ నోరు జారలేదా అని మహిళా ఫ్యాన్సు నిలదీశారు. ఆ రోజులో గేమ్ లో భాగంగా కౌషల్ మాకు పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్నామన్న మాట మీద నానీ దారుణమైన సెటైర్ వేశాడని గుర్తు చేశారు. స్పర్శ పని చేయలేదా ? స్పర్శ లేకపోవడం వల్లే పిల్లలు పుట్టలేదా ? అంటూ కామెంట్స్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లలు కలగని మహిళలను నానీ అవమానించడం కాదా ? అని కౌషల్ ఆర్మీ నిలదీసింది. కనీసం ఆ కామెంట్స్ పై సారీ కూడా చెప్పలేదని మండిపడింది. కౌషల్ జస్ట్ ఫర్ కిడ్డింగ్ అంటూ అన్న కామెంట్ ను సాగదీసి సాగదీసి నానీ చాలా ఓవర్ యాక్టింగ్ చేశాడని కౌషల్ అభిమానులు మండిపడ్డారు. మిగతా కంటెస్టంట్లు అందరూ నోరు జారినా కనపడని, వినపడని నానీకి కౌషల్ సరదాగా అన్నాను, అని చెప్పి సారీ చెప్పుకున్నా కనపడలేదా ? ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లాసులో రంగునీళ్ల టాస్కులో సంచాలకుడిగా కౌషల్ డిజాస్టర్ అంటూ రెచ్చిపోయిన నానీ వాస్తవానికి యాంకర్ గా డిజాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ యాంకరింగ్ కి నానీ ఎన్టీఆర్ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు డిజాస్టర్ యాంకరింగ్ నీదే.. బిగ్ బాస్ ప్లీజ్ ఎలిమినేట్ నానీ…అంటూ రిక్వెస్టులు పెట్టారు. మొత్తానికి విజయవాడలో కౌషల్ ఆర్మీ ప్రభంజనం చూశాక మిగతా కంటెస్టెంట్లు బంధువులు, నానీ నోరెళ్లబెట్టడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -