Saturday, May 18, 2024
- Advertisement -

చ‌రిత్ర సృష్టించిన కౌశ‌ల్ ఆర్మీ

- Advertisement -

తెలుగు బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మ‌రో రెండు వారాల్లో ముగియ‌నుంది.షోలో ఎనిమిది మంది స‌భ్యులు ఉన్న‌ప్ప‌టికి అంద‌రి క‌ళ్లు ఒక‌రిపైనే ..ఆ ఒక్క‌రు ఎవ‌రో కాదు కౌశ‌ల్‌. బిగ్ బాస్ సీజన్‌ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్ప‌టికి జ‌రిగిన ఎలిమినేష‌న్స్‌ను ఒక‌సారి పరిశీలిస్తే 90% కౌశ‌ల్‌తో గొడ‌వ ప‌డి ఎలిమినేట్ అయిన వాళ్లే ఎక్కువ‌. సోష‌ల్ మీడియాలో ఆయ‌న పేరిట ఓ ఆర్మీని కూడా సృష్టించారు. వీరు భారీగా కౌశ‌ల్‌కు త‌మ మ‌ద్ద‌తు తెలుపుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఎపిసోడ్ ప్రారంభమైంది మొదలు ఆయనకు అనుకూలంగా ప్రత్యర్థి కంటెస్టెంట్స్‌కు వ్యతిరేకంగా వరుస పోస్ట్‌లు కుప్పలుతెప్పలుగా దర్శనం ఇస్తున్నాయి.

ఇక కౌశల్ ఎలిమినేషన్‌లో ఉంటే ఓట్లు కోట్ల వర్షం కురుస్తుందంటే.. ఇతగాడి ఫాలోయింగ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇక గ్రాండ్ ఫినాలేకి మరో 10 ఎపిసోడ్‌లు మాత్రమే మిగిలి ఉండటంతో కౌశల్ ఆర్మీ తమ సోషల్ మీడియా యాక్టివిటీని మరింత ముమ్మరం చేశారు. కేవలం సోషల్ మీడియాలో ట్వీట్లకు మాత్రమే పరిమితం కాకుండా కౌశల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను బలనిరూపణ ద్వారా తెలియజేసేందుకు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం 6:30 గంటలకు 2కె రన్ నిర్వహించింది కౌశల్ ఆర్మీ. ఇందుకోసం ప్రత్యేకంగా కౌశల్ ఆర్మీ పేరుతో ముద్రించిన టీ షర్ట్‌లను, పోస్టర్స్‌… ఒక సాధ‌ర‌ణ కంటెస్టెంట్‌కు ఇలా భారీ ఎత్తున మ‌ద్ద‌తు రావడం ఇదే మొద‌టిసారి. ఇక బిగ్‌బాస్‌లోని ఓ వ్య‌క్తి కోసం ర్యాలీలు చేయ‌డం అనేది బిగ్‌బాస్ చ‌రిత్ర‌లో నిలిచిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -