Friday, May 10, 2024
- Advertisement -

‘క‌వ‌చం’ రివ్యూ

- Advertisement -

బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ విజ‌యం కోసం ట్రై చేస్తునే ఉన్నాడు.పెద్ద ద‌ర్శ‌కులతో సినిమాలు చేసిన ఫ‌లితం లేక‌పోయింది.బెల్లంకొండ సినిమాలు భారీ బడ్జెట్‌తో తెర‌కెక్క‌డం కూడా అత‌ని సినిమాలు ఫెయిల్ అవ‌డానికి ఓ కార‌ణం అని తెలుస్తుంది.బెల్లంకొండ మ‌రో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.ఆయ‌న తాజాగా న‌టించిన సినిమా క‌వ‌చం. ఈ సారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో కవచం సినిమా చేశాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్‌ మామిళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు సక్సెస్‌ అందించిందో లేదో స‌మీక్ష ద్వారా చూద్దాం.

కథ :
విజయ్‌ (బెల్లంకొండ) పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్స్‌పెక్టర్‌. నిజాయితీగా పని చేసే విజయ్‌ ఎన్‌కౌంటర్‌ స్పెలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి(కాజల్‌)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే ఆ అమ్మాయికి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తరువాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్‌) అనే అమ్మాయిని కాపాడతాడు విజయ్‌. ఆ తరువాతి రోజు విజయ్‌ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్‌ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్‌ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్‌ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్‌ అయ్యిందని, ఎస్‌ఐ విజయ్‌ కిడ్నాప్‌ చేశాడని న్యూస్‌లో వస్తుంది.అసలు సంయుక్త ఏమైంది..? ఈ కిడ్నాప్‌ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..?ఈ ప్రశ్నలకు విజయ్‌ ఎలా సమాధానం కనుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ప‌ర్ఫామెన్స్‌:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ మరోసారి మాస్‌ యాక్షన్‌ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నటనపరంగా పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించకపోయినా పోలీస్‌ లుక్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌, డ్యాన్స్‌లతో మెప్పించాడు. హీరోయిన్స్‌గా కనిపించిన కాజల్‌, మెహరీన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌తోనూ ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా పరిచయం అయిన బాలీవుడ్ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ స్టైలిష్‌ లుక్‌లో మెప్పించాడు. రెండు షేడ్స్‌ను చాలా బాగా చూపించాడు. పోలీస్‌ అధికారిగా హరీష్ ఉత్తమన్‌ పర్ఫెక్ట్‌గా సరిపోయాడు. ముఖేష్‌ రుషి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్‌ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులను థ్రిల్‌ చేసినా చాలా చోట్ల స్లోగా కథను నడిపించి నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో కిడ్నాప్‌ సీన్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ తప్ప మిగతా కథనమంతా నెమ్మదిగా నడుస్తూ సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండ్‌ హాఫ్‌లో కథనం స్పీడందుకుంటుంది. సినిమాకు మరో మేజర్‌ మైనస్‌ పాయింట్‌ సంగీతం. తమన్‌ అందించిన పాటల్లో ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా లేదు. నేపథ్యం సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాలను డామినేట్‌ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది.

బోట‌మ్ లైన్ : మ‌రోక‌టి త‌న ఖాత‌లో వేసుకున్న బెల్లంకొండ‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -