- Advertisement -

సింగ‌ర్ సునీత‌కు ఘోర అవ‌మానం

- Advertisement -

సింగ‌ర్ సునీత ఎంత‌టి ఫేమ‌స్సో అంద‌రికి తెలిసిందే. ఆమె త‌న గాత్రంతో పాటు ,త‌న అందంతో కూడా అభిమానులను సంపాదించుకుంది. సునీత సినిమాలలో పాట‌ల‌తో పాటు ప‌లు స్టేజ్ షోల‌పై కూడా పాటలు ప‌డుతుంది. మ‌రి అలాంటి సునీత‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. శ్రీకాకుళం జ‌ర‌గ‌నున్న ఓ కార్యక్రమంలో సింగ‌ర్ సునీత పాల్గోనాల్సి ఉంది.అయితే పోలీసుల నుండి దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంతో చివరి నిమిషంలో పోలీసులు ఆ కార్యక్రమాన్ని ఆపేశారు.

ఇది తెలియ‌ని సునీత శ్రీకాకుళం చేరుకున్నారు.ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర వైఎస్ఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సునీత పాటలు పాడేందుకు అక్కడకి వెళ్లారు.ఈ కార్య‌క్ర‌మానికి పోలీసులు అనుమ‌తి నిరాకరించ‌డంతో ప్రొగ్రామ్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో చేసేది లేక సునీత అక్క‌డ నుంచి వెనుదిరిగారు.అప్పటికే షో కోసం వచ్చిన జనాలు, అతిథులు అక్కడ నుండి అసహనంతో వెళ్లిపోయారు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -