Tuesday, May 21, 2024
- Advertisement -

“కేడి బిల్లా-కిలాడి రంగా” ట్రైలర్ లాంచ్ !!

- Advertisement -

భీమవరం టాకీస్‌ పతాకంపై రాజ్ కందుకూరి సమర్పణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తాజాగా అందిస్తున్న అనువాద చిత్రం “కేడి బిల్లా-కిలాడీ రంగా”. “పసంగ, మేము, కథకళి” వంటి సూపర్ హిట్  చిత్రాల ఫేం పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.  రెజీనా-బిండుమాధవి హీరోయిన్లుగా,  విమల్‌-శివకార్తికేయన్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించారు.  మే 13న విడుదల కానున్న ఈ చితరం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసారు. 

ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ “కేడి బిల్లా.. కిలాడి రంగా” ట్రైలర్ ను విడుదల చేసి.. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయం సాధించాలని అభిలషించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, భద్రకాళి ఫిల్మ్స్ అధినేత ప్రసాద్, బాలాజీ నాగలింగం, ఎన్.ఎస్.ఆర్ ఫిల్మ్స్ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి.సత్యనారాయణ, డైలాగ్ రైటర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.  “కేడి బిల్లా-కిలాడీ రంగా” తప్పకుండా ఘన విజయ సాధించాలని వారంతా ఆకాక్షించారు. 

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ..  “రెజీనా, బిందుమాధవిల గ్లామర్‌- విమల్‌, శివకార్తికేయన్‌ల పెర్‌ఫార్మెన్స్ – యువన్‌ శంకర్‌రాజా సంగీతం “కేడి బిల్లా-కిలాడి రంగా” చిత్రానికి ముఖ్య ఆకర్షణలు. “పసంగ, మేము, కథకళి” వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు పాండిరాజ్ “కేడి బిల్లా-కిలాడీ రంగా” చిత్రాన్నిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. త్వరలో ఆడియో రిలీజ్‌ చేసి, మే 13న సినిమాను విడుదల చేయనున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, పాటలు: పోతుల రవికిరణ్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్: డా.శివ. వై. ప్రసాద్- బి.సత్యనారాయణ,  సమర్పణ: రాజ్‌ కందుకూరి, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: పాండిరాజ్‌!!

{youtube}v=KyZ5XD9k_dc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -