Saturday, April 20, 2024
- Advertisement -

‘గుప్పెడంత ప్రేమ’ ఆడియో విశేషాలు!

- Advertisement -

సాయి రోనక్, అదితి సింగ్ జంటగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వం వహించిన చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. మధుర శ్రీధర్ రెడ్డి, సందీప్ కిషన్ కలిసి బిగ్ సీడీను ఆవిష్కరించారు. సందీప్ కిషన్ ఆడియో సీడీలను రిలీజ్ చేసి మొదటి కాపీను వంశీకు అందించారు. ఈ సందర్భంగా..

సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే ట్విట్టర్ లో ఈ సినిమా ట్రైలర్ చూశాను. బాగా నచ్చింది. పాటలు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. టీం అందరికి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.

వంశీ మాట్లాడుతూ.. ” వినోద్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. తను చేసిన ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. విజువల్స్ చాలా బావున్నాయి. సినిమాలో పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి” అని చెప్పారు.

మధురా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ”వినోద్ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఎప్పుడు  సినిమా గురించే మాట్లాడుతుంటాడు. తనకు ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని చెప్పారు.

వినోద్ మాట్లాడుతూ.. ”అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఇది. ఫస్ట్ లవ్ లో ఉండే ఫీలింగ్స్ ఎలా ఉంటాయి.. ఆ ప్రేమ కాలాన్ని, దూరాన్ని ఎలా జయిస్తుందనే కాన్సెప్ట్ తో సినిమా తీశాను. రొమాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఇలా అన్నీ సినిమాలో ఉంటాయి. ఈ కథకు మ్యూజిక్ చాలా ముఖ్యం. ఈ సినిమాకు సంగీతమే సోల్. ప్రతి సాంగ్ అధ్బుతంగా ఉంటుంది” అని చెప్పారు.

నవనీత్ సుందర్ మాట్లాడుతూ.. ”గుప్పెడంత ప్రేమ ఆర్డినరీ లవ్ స్టొరీ కాదు. హానెస్ట్ ఫిలిం. సినిమా కథ వినగానే బాగా నచ్చింది. సినిమాలో మొత్తం 8 పాటలు ఉంటాయి. అందరికి స్టోరీ కనెక్ట్ అవుతుంది” అని చెప్పారు.

ఈ చిత్రానికి లిరిక్స్: వనమాలీ, శ్రీమణి, గణేష్, తిల్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పావని లింగాల, ఆర్ట్: రాజీవ్ నాయిర్, ఎడిటింగ్: బసవ పైడిరెడ్డి, సినిమాటోగ్రఫీ: సంజయ్ లోక్ నాథ్, మ్యూజిక్: నవనీత్ సుందర్, నిర్మాణం: ఐ వింక్ ప్రొడక్షన్స్, కథ-దర్శకత్వం: వినోద్ లింగాల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -