Sunday, May 4, 2025
- Advertisement -

బోటు ఆపండి బాబో.. పరిగెత్తిన కీర్తి సురేష్!

- Advertisement -

హీరో రామ్ నటించిన నేనూ శైలజ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్. ఆ తర్వాత నాని నటించిన నేను లోకల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

తాజాగా నితిన్ హీరోగా రంగ్ దే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాలో కీర్తి న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ షేర్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్, కీర్తిలు ఒక‌రినొక‌రు ఆట‌ప‌ట్టించుకోవ‌డం, కీర్తి త‌ప్పిపోయింద‌ని నితిన్ ట్వీట్ చేయ‌డం, ర‌క‌ర‌కాల చీర‌ల‌లో కీర్తి సురేష్‌ క‌నిపించిన విషయం తెలిసిందే.

తాజాగా కీర్తి సురేష్ త‌న ఇన్‌స్టాగ్రాములో బోట్ కోసం ప‌రుగెత్తుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో వీకెండ్ కోసం పరిగెత్తుతున్నాను అని క్యాప్ష‌న్ పెట్టింది. మొత్తానికి కీర్తి సురేష్ పరుగెత్తడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -