Friday, April 19, 2024
- Advertisement -

దుమ్మురేపుతున్న కేజీఎఫ్-2 ట్రైలర్

- Advertisement -

మోస్ట్ అవైటెడ్ మూవీ కేజీఎఫ్‌-2 ట్రైలర్ దుమ్మురేపుతోంది. తెలుగు ట్రైలర్ విడుదలైన అరగంటలోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యష్, డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాబినేషన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీకోసం సంవత్సరం నుంచి ఫ్యాన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కరోనాతో ఎప్పటికప్పుడు సినిమా వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పుడు అభిమానుల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ మూవీ యూనిట్ ట్రైలర్ లాంఛ్ చేసింది. హైపిచ్ లో ఉన్న ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

కేజీఎఫ్‌ను స్వాధీనం చేసుకున్నాక రాకీకి ఎదురైన సవాళ్లు.. పోరాటాల నేపథ్యంలో ట్రైలర్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఓ వైపు అధీరా కేజీఎఫ్ ఆక్రమించడానికి దండెత్తడం, మరోవైపు కేంద్రప్రభుత్వం రాకీని అంతంచేయాలని చూడటం… ఈ నేపథ్యంలో రాకీ ఎక్కడా తగ్గకపోవడాన్ని ట్రైలర్ లో చక్కగా ప్రజెంట్ చేశారు. ఇది రక్తంతో రాసిన కథ.. సిరాతో ముందుకు తీసుకెళ్లలేం… ముందుకువెళ్లాలంటే మళ్లీ రక్తాన్నే అడుగుతుందనే ప్రకాశ్ రాజ్ కామెంట్లతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రధాని రాకీని చంపేయాలడం… వెంటనే అధీరా పాత్రలో ఉన్న సంజయ్‌దత్ .. యుద్ధంచేసేది నాశనానికి కాదు.. ఉద్దరించడానికి అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పడం ట్రైలర్ ను మరోరేంజ్‌కు తీసుకెళ్లింది. ఇక ట్రైలర్ లో రాకీ ఎంట్రీ ….రేంజ్ ను మరింత పెంచింది.

ఐ డోంట్ లైక్ వయొలెన్స్.. బట్ వయొలెన్స్ లైక్స్ మీ… ఐ కాంట్ అవాయిడ్ అంటూ రాకీ చెప్పిన డైలాగ్స్ ఈ ట్రైలర్ కే హైలైట్. నాకెవ్వరి దోస్తానా అక్కర్లేదు.. నాతో దుష్మనీ ఎవరూ తట్టుకోలేరంటూ రాకీ గట్టివార్నింగ్ ఇవ్వడం.. బిజినెస్ చేద్దామా… ఆఫర్ క్లోజెస్ సూన్ అంటూ చెప్పడంతో కేజీఎఫ్-2 టైటిల్ స్క్రీన్‌పై పడుతుంది.

కేజీఎఫ్‌-1 లో అందరూ కనెక్టయిన మదర్ సెంటిమెంట్ ను పార్ట్-2 లో కూడా దర్శకుడు బాగానే ప్రజెంట్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. దానికి తగ్గట్లే ట్రైలర్ ను మదర్ సెంటిమెంట్ తోనే ఎండ్ చేశారు దర్శకుడు నీల్. నీకు ప్రపంచంలో ఉన్న బంగారమంతా తెచ్చిస్తానమ్మా అని రాకీ చెప్పడం.. సర్లే ఇప్పుడు పడుకో.. పొద్దున్నే వెళ్లి తెచ్చిద్వువుకానీ అని తల్లి అనడంతో ట్రైలర్ ఎండ్ అవుతుంది. మొత్తంగా కేజీఎఫ్-2 ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా ప్రేక్షకుల్లో ఉత్సుకతను నింపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -