Saturday, May 4, 2024
- Advertisement -

సినిమాల నుంచి తప్పుకుంటున్నానన్న అమీర్ ఖాన్.. కారణం అదేనట

- Advertisement -

అమీర్ ఖాన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. వెండి తెరకు ఈ బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ దూరం కాబోతున్నాడు. త్వరలోనే సినిమాలకు శాశ్వతంగా గుడ్‌బై చెబుతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. తాను సినిమాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నానో కూడా వెల్లడించాడు.

పిల్లలకు ఎక్కువ సమయం వెచ్చించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. సినిమాల కారణంగా సమయం వెచ్చించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబానికి తనకు మధ్య సినిమాల కారణంగా గ్యాప్ పెరిగిపోతోందనీ.. ఇది అర్ధమయ్యేందుకు తనకు ఇంతకాలం పట్టిందన్నాడు.

అందుకే ఇంకో మూడు, నాలుగేళ్లలో తాను సినిమాల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశాడు. 50 ఏళ్లలోనూ ఎవర్ యంగ్‌గా కనిపిస్తూ బాలీవుడ్‌ను ఏలుతున్న ఖాన్‌ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -