డియర్ కామ్రేడ్ రీమేక్ లో హీరోయిన్ కన్ఫర్మ్

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో భరత్ అనే నేను అనే సినిమా తో పరిచయం అయ్యి, తన పర్ఫార్మెన్స్ తో ఎందరినో మెప్పించి ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న నటి కైరా అద్వానీ. కైరా అద్వానీ, మహేష్ బాబు ల జంట కి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కైరా తెలుగు లో రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ అనే సినిమా చేసింది కానీ ఆ సినిమా ఆశించిన స్థాయి లో ఆడకపోవడం తో కైరా కి పెద్దగా ఉపయోగపడలేదు. నిజానికి హిందీ హీరోయిన్ కావడం, అక్కడ ఆల్రెడీ విజయాలు టేస్ట్ చేయడం తో కైరా కి అక్కడ వరుస అవకాశాలు వచ్చాయి. అందులో భాగం గా అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమా లో షాహిద్ కపూర్ సరసన హీరోయిన్ గా నటించింది కైరా అద్వానీ.

అయితే ఇప్పుడు తాజా బాలీవుడ్ సమాచారం మేరకు కైరా వేరొక తెలుగు రీమేక్ లో నటించనుందట. తెలుగు లో ఇటీవలే విడుదల అయిన సినిమా డియర్ కామ్రేడ్ ని హిందీ లో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు కరణ్ జోహార్. ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర లిల్లీ ని తెలుగు లో రష్మిక చేయగా, హిందీ లో కైరా తో చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -