Friday, March 29, 2024
- Advertisement -

కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలకు మరో సారి ఆజ్య పోసిన రోహిత్ ట్వీట్….

- Advertisement -

అనేక వివాదాల మధ్య టీమిండియా విండీస్ టూర్ కు బయలు దేరింది. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత రోహిత్, కోహ్లీ ల మధ్య విబేధాలు ఉన్నాయనె వార్తలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి. వాటన్నింటికి ప్రెస్ మట్ లో కెప్టెన్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు.

ఇదలా ఉంటె తాజాగా రోహిత్ చేసిన ట్వీట్ వీళ్లమధ్య ఉన్న విబేధాలకు మరింత ఆజ్య పోసింది. ఇన్నాళ్లు మైనంగా ఉన్న రోహిత్ బుధవారం చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. దీంతో విబేధాలు ఉన్నాయనేది స్పష్టంగా బయటపడింది. శనివారం రాత్రి 8 గంటలకి అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

నేను జట్టు కోసం మాత్రమే కాదు… దేశం కోసం బరిలోకి దిగుతా అని రోహిత్ ట్వీట్ చేశాడు. విండీస్ టూర్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ.. రోహిత్‌తో విభేదాల అంశంపై వివరణ ఇచ్చాడు. అవన్నీ అవాస్తవాలని, జట్టులో అందరం కలిసే ఉన్నామని స్పష్టం చేశాడు. అయితే కోహ్లీ తప్ప మరెవరూ ఈ విషయంపై మాట్లాడని నేపథ్యంలో రోహిత్ చేసిన ట్వీట్ మరిన్ని వాదనలకు దారి తీసే అవకాశముంది.

మ‌రి మిగితా క్రికెట‌ర్లు దేని గురించి ఆడుతున్న‌ట్లు అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఒక‌వేళ విరాట్‌తో విభేదం ఉంటే నేరుగా చెప్పాలి. కానీ కేవ‌లం జ‌ట్టు కోస‌మే కాదు, దేశం కోసం ఆడుతాన‌ని అన‌డంలో ఆంత‌ర్యం అర్థం కావ‌డంలేదు. మరో వైపు మిగితా 11 మంది ఆటగాళ్లు దేని కోసం ఆడుతున్నట్లు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ట్వీట్ జట్టులో మరిన్ని విబేధాలకు దారి తీయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -