Tuesday, May 14, 2024
- Advertisement -

ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమాను రిలీజ్ చేయలేకపోతున్నారు!

- Advertisement -

ఒకరు ఏకంగా ఇద్దరు హీరోలు ఆ సినిమా ముందు వెనకగా ఉన్నారు. ఒకరు హీరోగా.. మరొకరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ ఇద్దరూ హిట్స్ లో ఉన్నవారే.

అయితే ఇప్పటి వరకూ ఆ సినిమా మాత్రం విడుదల కాలేదు. సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా తొలి వెర్షన్ స్ఫూర్తితోనైనా విడుదల కాకపోవడం విశేషం. ఇదంతా “కిక్ -2′ విషయంలో!

రవితేజ హీరోగా రూపొందిన కిక్ సినిమాకు కొనసాగింపుగా ఇది రూపొందింది. తొలి వెర్షన్ ను రూపొందించిన సురేందర్ రెడ్డినే దీనికి దర్శకత్వం వహించాడు. ఈ సీక్వెల్ వెర్షన్ కు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించడం ఆసక్తికరమైన అంశం. ఇటీవలే హీరోగా కమ్ నిర్మాతగా హిట్ కొట్టిన కల్యాణ్ రామ్ సినిమా కాబట్టి ఇది ఉత్సాహవంతంగా విడుదల కావాల్సింది.

అయితే ఇది వరస వాయిదాలతోనే పోతోంది. ఇప్పటికే ఎప్పటికో విడుదల కావాల్సిన ఈ సినిమా గురించి ఇప్పుడు క్లారిటీ లేదు. జూన్ లో విడుదల కాది స్పష్టం అవుతోంది.. ఇక జూలై విషయంలో కిక్ -2 యూనిట్ ఏమీ చెప్పడం లేదు. ఈ సినిమా విడుదల ఆగస్టు వరకూ వాయిడా పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. ఇలా విడుదల ఆగడానికి అనేక రీజన్లున్నాయి. ఎన్ని రీజన్లు ఉన్నా. .ఇద్దరు హీరోల ఆధ్వర్యంలోని సినిమా విడుదల కాలేకపోవడం ఏమిటో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -