నెల్లూరులో వైసిపికి షాక్!

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నెల్లూరులో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షునిగా ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం రాజీనామా చేశారు. 

తన రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్ మోహన్ రెడ్డికి పంపారు. మేకపాటి వర్గానికి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వర్గానికి కొనసాగిన విభేదాలే రాజీనామాకు కారణమని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే వైసిపి జనరల్ సెక్రెటరి విజయ సాయి రెడ్డి దీనిని ఖండించారు. ఇవన్నీ మీడియాలో వస్తున్న కథనాలు అధికారికంగా వెలువడినవి కావని ఆయన ఖండించారు.