Sunday, May 11, 2025
- Advertisement -

కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీ రివ్యూ

- Advertisement -
Kittu Unnadu Jagratha Movie Review

వరస హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్న రాజ్ తరుణ్ తాజాగా నటించిన సినిమా “కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త”. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

కార్ కేర్ నడుపుకునే కుర్రాడు కిట్టు (రాజ్ తరుణ్) జానకి (అను ఇమ్మాన్యుయేల్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతలోనే అతని ప్రేమకు అనుకోని కష్టం ఎదురై డబ్బు కోసం కుక్కల్ని కిడ్నాప్ చేసే పని మొదలుపెడతాడు. అలా కిట్టు కుక్కల్ని కిడ్నాప్ చేస్తున్న విషయం జానకికి తెలిసి ఆమె అతనికి దూరమైపోతుంది. అంతలోనే జానకిని సిటీలోనే పెద్ద క్రిమినల్(అర్బాజ్ ఖాన్) కిడ్నాప్ చేస్తాడు. ఆ విషయం తెలుసుకున్న కిట్టు జానకిని కాపాడే ప్రయత్నం మొదలుపెడతాడు. మరోవైపు పోలీసులు కూడా కిట్టుని పట్టుకోవాలని ట్రై చేస్తుంటారు. గ్యారేజ్ నడుపుకునే కిట్టు ఎందుకు కుక్కల్ని కిడ్నాప్ చేయాలనుకుంటాడు ? అసలు జానకి ఎవరు ? ఆమెని విలన్ ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? పోలీసులు కిట్టు వెంట ఎందుకు పడుతుంటారు ? ఇన్ని చిక్కుల మధ్య కిట్టు తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు ? అనేదే తెరపై నడిచే కథ…

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించింది కామెడీ.. సెకండాఫ్ వచ్చే పృథ్వి కామెడీ.. రోటీన్ స్పూఫ్ కామెడీ కాకుండా రేచీకటి ఉన్న రౌడీగా పృథ్వి చేసిన పెర్ఫార్మెన్స్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ ఇది. సెకండాఫ్ లో రౌడీ పాత్రలకు మధ్య నడిచే సన్నివేశాలు, సంభాషణలు చాలా బాగున్నాయి. హీరో కుక్కల్నికిడ్నాప్ చేయడం అనే అంశం వినడానికి సిల్లీగానే ఉన్నా స్క్రీన్ మీద మాత్రం చాలా కన్విన్సింగా ఉంది. కుక్కల్ని కిడ్నాప్ చేసే సన్నివేశాలు కూడా కాస్త ఫన్నీగా బాగున్నాయి. దర్శకుడు వంశీ కృష్ణ ఫస్టాఫ్ మొత్తాన్ని పర్వాలేదనిపించేలా నడిపినా ఇంటర్వెల్ సస్పెన్స్ ను మాత్రం చాలా ఆసక్తికరంగా, ఊహించని విధంగా ప్లాన్ చేసి మంచి సప్రైజ్ ఇచ్చాడు. దాంతో సెకండాఫ్లో ఏం జరుగుతుందో అనే ఆసక్తి రేకెత్తిచడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అలాగే హీరో – హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ అక్కడక్కడా కాస్త రొటీన్ గా అనిపించినా అను ఇమ్మాన్యుయేల్ స్క్రీన్ ప్రెజెన్స్ వలన చాలా చోట్ల ఇంప్రెస్ చేసింది. సెకండాఫ్లో ఫన్నీ సీన్స్ ను నడపడం ద్వారా ఎక్కడా పెద్దగా నిరుత్సాహం అనిపించకుండా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా అలా అలా సాగిపోతూ క్లైమాక్స్ లో ఒక్కసారిగా పృథ్వి కామెడీ ఎలివేట్ అవడంతో మంచి ఫన్ దొరికింది. రాజ్ తరుణ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అనూప్ రూబెన్స్ సంగీతం పర్వాలేదు. బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్ ను అందంగా కనిపించేలా చేసింది. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది. 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ఫస్టాఫ్ కథనం కాస్త బోర్ కొట్టించింది. ఫస్టాఫ్లో అక్కడక్కడా వచ్చే కొన్ని ఫన్నీ సీన్స్ బాగున్నాయనిపించేలోపు ప్రభాకర్ రౌడీ బ్యాచ్ మీద నడిచే కొన్ని రొటీన్ సీన్లు బోర్ తెప్పించాయి. ఫస్టాఫ్ లో కామెడీని కుడా పండించలేకపోయారు. సెకండాఫ్లో నడిచే ఫన్నీ స్క్రీన్ ప్లే బాగున్నా అది కాస్త ఎక్కువవడంతో కథ ఓ కొలిక్కి వచ్చి మెయిన్ ట్రాక్లో ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూడాల్సి వచ్చింది. క్లైమాక్స్ లో విలన్ పాత్రకు ఎండింగ్ ఇంకాస్త వెరైటీగా, బలంగా ఇచ్చి ఉంటే బాగుండేది.

మొత్తంగా : ఫస్ట్ ఆఫ్ కాస్తా స్లోగా నడిపిన.. సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి సినిమాని హిట్ వైపు తీసుకెళ్ళాడు. ఇక కామెడీ సినిమాలను.. రాజ్ తరుణ్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -