Monday, April 29, 2024
- Advertisement -

పాపం.. రాజ్ తరుణ్ పరిస్థితి ఇలా అయిందేంటి..?

- Advertisement -
raj tarun kittu unnadu jagratha release in march

రాజ్ తరుణ్ నటిస్తున్న కిట్టుగాడు సినిమా నవంబర్ నుంచి ఇదిగో అదిగో అంటూ రిలిజ్ చేస్తాం అని చెబుతూ వస్తున్నారు. ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు.. కానీ ఇప్పుడు మళ్లీ మార్చికి వెళ్లిపోతోంది. ఈ నెల 17కు రిలీజ్ చేద్దాం అనుకున్న ఇంకా వర్క్ ఫినిష్ కాలేదని అందుకే లేట్ అవుతుందని తెలుస్తోంది.

సెన్సారుకు అప్లయ్ చేసారు కానీ, పూర్తిగా పనులు జరిగి, క్యూబ్ అప్ లోడ్ కావడానికి టైమ్ సరిపోదట. దాంతో ఆ డేట్ ను ఘాజీ కి సోలోగా వదిలేస్తున్నారు. 24న రిలీజ్ చేద్దాం అంటే సాయి ధరమ్ తేజ విన్నర్ వస్తోంది. ఆ సినిమాతో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత మంచిది కాదు. ఇక మిగిలిన డేట్ అంటే మార్చిలోకి వెళ్లిపోవాల్సిందే. అయితే 3న విజయ్ దేవరకొండ ద్వారక వుంది.

ఆ సినిమాతో పాటు ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రెండూ యూత్ ఫిలిమ్ సినిమాలే అయినా ఇంకా ఆలోచిస్తూ వుంటే సరైన డేట్ దొరక్కుండా పోతుంది. నిజానికి సినిమాను వీర చెక్కుడు చెక్కకుండా వున్నా, అయిటమ్ సాంగ్ జోడించడం అన్నది ముందుగా అనుకున్నా ఈ పాటికి సినిమా రెడీ అయి వుండేది. కానీ అలా జరగలేదు. సరైన డేట్ దొరక్కుండా పోతోంది.

Related

  1. షాకింగ్ : రాజ్‌త‌రుణ్ తో హెబా ప‌టేల్‌ పెళ్లి
  2. రాజ్ తరుణ్ తో నాకు ఓకే అంటున్న కుమారి
  3. పీక‌ల్లోతు క‌ష్టాల్లో రాజ్ తరుణ్
  4. ఆ పని చేసి పోలీసుల‌కు అడ్డంగా దొరికిపోయిన రాజ‌మౌళి కొడుకు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -