Saturday, May 4, 2024
- Advertisement -

కత్తి వర్సెస్ పవన్…… అనవసరంగా కెలికి పవన్‌ని మరీ బఫూన్‌ని చేసిన కోన వెంకట్

- Advertisement -

మహేష్ కత్తి విమర్శలతో పూర్తిగా డిఫెన్స్‌లో పడిన పవన్ కళ్యాణ్ అండ్ కోని ఇప్పుడు పూర్తిగా బఫూన్స్‌గా చేయడానికి రెడీ అయ్యాడు కోన వెంకట్. రైటర్‌గా కంటే కూడా మేనేజ్‌మెంట్ వ్యవహారాలతో ఈ కోనవెంకట్ ఇండస్ట్రీలో బాగా ఫేమస్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే మహేష్ కత్తి కూడా బ్రోకర్‌ని మించిన బ్రోకర్ అని ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కోన వెంకట్ పవన్‌కి సపోర్ట్‌గా వచ్చి పవన్‌ని పూర్తిగా బఫూన్‌ని చేశాడని జోకులు పేలుతున్నాయి.
కోనవెంకట్ మాటలు పవన్‌ని బఫూన్‌ని చేసిన విధంబెట్టిదంటే……?
………శివుడికీ మూడో కన్ను ఉన్నట్టే పవన్ కళ్యాణ్‌కి కూడా ఉంది.
…….పవన్‌కి స్వార్థం లేదు…
……..పవన్ తన కోరికలన్నింటినీ ఎప్పుడో జయించారు.
…….ఓ శక్తి ఉంది….ఆ శక్తి అన్నింటినీ చూస్తోంది. ఆ శక్తి పవన్‌కి వచ్చినప్పుడు పవన్‌ని విమర్శిస్తున్నవాళ్ళంతా దేశం వదిలి వెళ్ళిపోవాలి.

డైలాగులు అదిరిపోయాయి కదా. బినామీ, కమెడియన్…..ఆ మధ్య అమ్మాయిల బ్రోకర్ అన్న ఆరోపణలు కూడా ఎదుర్కున్న బండ్ల గణేష్ కూడా పవన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో ఇలానే మాట్లాడేవాడు. ఇప్పుడు ఈ చెంపదెబ్బల కామెడీ రైటర్ కూడా పవన్‌ని ఇంకాస్త ఆకాశానికి ఎత్తేసి పవన్‌ని మరీ బఫూన్‌ని చేసి పడేశాడు. ఇప్పుడు కోన వ్యాఖ్యలపైనే సోషల్ మీడియాలో జోకులు పేలుతూ ఉన్నాయి. పవన్‌ని మరీ బఫూన్‌ని చేస్తూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజనులు. పవన్‌ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి విమర్శకులు ఎందుకు? బండ్ల గణేష్ , కోనలాంటి కొంతమంది భజన పరులు చాలేమో కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -