Friday, May 3, 2024
- Advertisement -

మూడు పెళ్ళిళ్ళు ఎందుకు అన్న ప్రశ్నకు చెప్పిన సమాధానంతోనే ఇప్పుడు పవన్ బుక్కయ్యాడా?

- Advertisement -

ఎప్పటికెయ్యది అప్పటి మాటలాడుతూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ ….. అని అంటూ ఒక సుమతీ శతకం ఉంటుంది. అయితే అలా మాట్లాడి ధన్యుడవ్వడం చాలా కష్టమే అని ఇప్పుడు పవన్ బుక్కయిన విధానం చూస్తే తెలుస్తోంది. మిగతా స్టార్స్ విషయంలో అయితే ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ పొద్దస్తమానం నీతులు చెప్పడానికే పుట్టా అనే రేంజ్‌లో బిల్డప్పులు ఇస్తూ ఇతర హీరోలకంటే నేను చాలా భిన్నం, నాకు హీరోయిన్స్‌తో ఎప్పుడూ కెమిస్ట్రీ ఉండదు అని చెప్పే పవన్ పురాణాల గురించి మాట్లాడాలా? వద్దా? ఇతర హీరోలందరూ కూడా తమతో కలిసి ఆరు నెలల పాటు ట్రావెల్, నటించిన హీరోయిన్స్ పేర్లను ఎంచక్కా చెప్పేస్తూ ఉంటారు. ఒక్క పవన్ సారు మాత్రం ప్రతి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌‌లోనూ హీరోయిన్స్ పేర్లు మర్చిపోతూ ఉంటారు. ఆ హీరోయిన్స్‌తో నాకు అసలు పరిచయమే ఉండదు అన్న కలరింగ్ ఇవ్వాలన్న ఉద్ధేశ్యం అన్నమాట. తెరవెనుక ‘పురాణాలు’ బయటపడకుండా ఉండడం కోసమే ఆ స్థాయి డ్రామాలు ఆడుతుంటాడా?

మూడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు అన్న ప్రశ్నకు పవన్ చెప్పిన సమాధానం గుర్తుందా? అది తప్పే కాదు అని తనను తాను సమర్థించుకోవడం కోసం ‘పెళ్ళి చేసుకోకుండా ముప్ఫై మందితో తిరిగితే ఒకేనా?’ అని ఎదురు ప్రశ్నించాడు పవన్. అంటే మిగతా వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాలు నెరుపుతుంటే ……నేను మాత్రం నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటున్నాను…..కాబట్టి వాళ్ళకంటే నేను పతితుడిని అన్నది పవన్ భావం. ఒకే ఒక్క పెళ్ళితో అక్రమ సంబంధాలు లేకుండా ఉన్నవాళ్ళ గురించి పవన్ అస్సలు మాట్లాడలేదు. ఎందుకంటే తనకంటే పెద్ద తప్పుడు మనుషుల గురించి చెప్తే తాను చాలా తక్కువ చేసిన తప్పుడు మినిషిగా మిగులుతానని, తన గొప్పతనం ఆ రకంగా నిలబడుతుందని ప్రతి మనిషీ ఫీలవుతూ ఉంటాడు. పవన్ కూడా అదే చేశాడా ? అన్న అనుమానాలు ఇప్పుడు వస్తున్నాయి.

సర్దార్ గబ్బర్ సింగ్ కోసం ముందుగా అనుకున్న ఒక హీరోయిన్ పవన్ ఫాం హౌస్‌కి తరచుగా వెళుతూ ఉండేదని ఫిల్మ్ నగర్‌లో విశ్వసనీయ వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక తాజాగా మహేష్ కత్తి పూనం కౌర్ వ్యవహారాన్ని బయటపెట్టాడు. పూనం కౌర్‌తో ఏ సంబంధమూ లేకపోతే పూనం కౌర్ గురించి చంద్రబాబుకు చెప్పి పూనం కౌర్‌ని ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఒక విభాగానికి బ్రాండ్ అంబాసిడర్‌ని చేయాల్సిన అవసరం పవన్‌కి ఏముంది? ఇక ఒకే గోత్రంతో పూజలు చేయించడం ఏంటి? ఇక పవన్, పూనం కౌర్‌లతో త్రివిక్రమ్ శ్రీనివాస్ క్షుద్ర పూజలు చేయించడం ఏంటి? వీటికి సంబంధించిన ఆధారాలు మొత్తం తన దగ్గర ఉన్నాయని మహేష్ కత్తి చెప్తున్నాడు. ఇక ఒక ఛానల్‌లో కూర్చున్న ఒకరు పవన్‌ని సమర్థిస్తూ…..అవి క్షుద్ర పూజలు కాదు….జల్సా టైంలో చేసిన పూజలు అని చెప్పాడు. అంటే పూజలు చేసింది నిజం అని పవన్ మనుషులు ఒప్పుకున్నట్టు. అయితే మహేష్ కత్తి మాత్రం తనకు క్షుద్ర పూజలకు, మామూలు పూజలకు తేడా తెలుసునని, అలాగే క్షుద్ర పూజల టైంలో వేసే ముగ్గులు ఎలా ఉంటాయో కూడా తనకు తెలుసునని చెప్పాడు మహేష్ కత్తి. మొత్తం సాక్ష్యాలతో తన దగ్గర వీడియో ఉందని చెప్పాడు మహేష్ కత్తి.

మహేష్ కత్తి అడిగిన ప్రశ్నలకు పవన్ ఎలాగూ సమాధానం చెప్పడు. చెప్పలేడు అన్నది నిజం. కానీ ఆయన ఫ్యాన్స్ చేసిన హంగామా పుణ్యమాని ఇప్పుడు పవన్ పూర్తిగా బుక్ అయ్యాడు అన్నది నిజం. తిరుమల టెంపుల్ వ్యవహారం నుంచీ పవన్ చేసిన తాంత్రిక పూజల వరకూ…..త్రివిక్రమ్ చేయించిన పూజలు……..పూనమ్ కౌర్‌కి పెళ్ళి చేసుకుంటానని మాట ఇవ్వడం…..అది జరగక ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేయడం…….ఆ తర్వాత హాస్పిటల్ ఖర్చులన్నీ పవన్‌నే భరించడం…….ఇప్పుడు ఏ అర్హతా లేని పవన్‌కి తాను రాజకీయ భజన చేస్తున్న చంద్రబాబు చేత బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇప్పించడం వగైరా వ్యవహారాలన్నీ బయటకు రావడంతో పవన్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయినట్టే. ఇకపైన కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటూ గొప్పగా కబుర్లు చెప్పగలడా? ఓటుకు కోట్లు కేసులో అడ్డంగాి ఆధారాలతో సహా బుక్ అయినప్పటికీ నేను నిప్పు……అవినీతి మరక నాకు అంటదు అని చెప్పుకునే నాయకుడికి భజన చేస్తున్న నట నాయకుడు కాబట్టి…..ఎన్ని పెళ్ళిళ్ళైనా…..ఇంకెన్ని పురాణాలు ఉన్నా……నేను పునీతుడినే అని చెప్పుకుంటాడా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -