Saturday, May 4, 2024
- Advertisement -

శ్రీరెడ్డి ఆరోపణలలో నిజం లేదు : కోనా వెంకట్

- Advertisement -

టాలీవుడ్ సంచ‌ల‌న తార శ్రీరెడ్డి రోజుకో సంచ‌ల‌నానికి తెర లెపుతుంది.శ్రీరెడ్డి లీక్స్ పేరుతో చిత్ర పరిశ్రమలోని క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రతి రోజు కొన్ని లీకులు పోస్టు చేస్తున్న శ్రీరెడ్డి ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. తెలుగులో బ‌డా నిర్మాత అయిన ద‌గ్గుబాటి స‌రేష్ బాబు రెండవ కుమారుడు అభిరాం త‌న‌ని వాడుకొని వ‌దిలేశాడు అని చెప్పింది.చెప్ప‌డంతోపాటు శ్రీరెడ్డి అభిరాం శ్రీరెడ్డి ముద్దు పెట్టుకున్న కొన్ని ఫోటోలు కూడా విడుద‌ల చేసింది.దీంతో తెలుగు ఇండ‌స్ట్రీ మొత్తం ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది.ఇంకా చాలామంది ఉన్నార‌ని ఒక్కోక్క‌రిని బ‌య‌టికి లాగుతాన‌ని చెప్పిన శ్రీరెడ్డి అన్న‌ట్లుగానే మ‌రో వ్య‌క్తి పేరు బ‌య‌ట‌పెట్టింది.

ఆ వ్య‌క్తి ఎవ‌రో కాదు సినీ ర‌చ‌యిత అయిన కోనా వెంక‌ట్‌.కోనా వెంక‌ట్ త‌న‌ని ఆయ‌న గెస్ట్ హోస్‌కి ర‌మ్మ‌ని పిలిచాడు అని కోన‌పై ఆరోప‌ణ‌లు చేసింది శ్రీరెడ్డి.దీనిపై స్పందించిన కోనా…ఓ నటి చేస్తున్న ఆరోపణలతో తాను షాక్‌కు గురయ్యానని ట్వీట్ చేశారు. తనతో సహా కొంతమందిపై ఆమె చేస్తున్న ఆరోపణలపై పోలీసులతో దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. వాస్తవాలను వెలికి తీసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చీప్ పబ్లిసిటీ కోసం కొందరు ఇటువంటి చవకబారు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్టు చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -