Saturday, May 4, 2024
- Advertisement -

రామ్ చరణ్ జడ్జ్‌మెంట్ కేక…… నిరూపించిన నానీ… కృష్ణార్జునయుద్ధం రివ్యూ

- Advertisement -

కృష్ణార్జునయుద్ధం కథతో రామ్ చరణ్ చుట్టూ సంవత్సరం పాటు తిరిగాడు గాంధీ. అప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన మేర్లపాక గాంధీకి అంత అవసరమా అని ఇండస్ట్రీ జనాలు కూడా గుసగుసలాడుకున్నారు. అయితే మేర్లపాక గాంధీ మాత్రం రామ్ చరణ్‌తో సినిమా చేసి నెక్ట్స్ లెవెల్‌కి వెళ్ళాలనుకున్నాడు. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ కథతో చేస్తే నా లెవెల్ పడిపోద్దనుకున్నాడు. అందుకే నో చెప్పాడు. అయితే నానీ మాత్రం వెంటనే చేయడానికి రెడీ అయిపోయాడు. మరి ఇద్దరిలో ఎవరి జడ్జ్‌మెంట్ రైట్ అయిందో చూద్దామా?

ఆద్యా న్యూస్ ముందే చెప్పినట్టుగా ఈ కథ ఏంటంటే…… చిత్తూరు జిల్లాల్లో ఒక విలేజ్‌లో ఉండే ఒక కృష్ణుడు. అమ్మాయిలందరికీ ట్రై చేస్తూ ఉంటాడు. ఎవరూ పడరు. ఇక ఫారెన్‌లో ఉండే రాక్ స్టార్ అర్జున్…..అతగాడికి మాత్రం అమ్మాయిలు ఇట్టేపడిపోతూ ఉంటారు. జన్మతః ఎలాంటి సంబంధం, బంధుత్వం గట్రాలు ఏమీ లేకపోయినప్పటికీ ఈ ఇద్దరు హీరోలు కూడా ఒకేలా ఉంటారు. ఆ తర్వాత ఇద్దరూ కూడా చెరో అమ్మాయితో లవ్‌లో పడతారు. ఆ తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్‌లో ఒక విలన్ బ్యాచ్ ఆ ఇద్దరు అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారు. ఇక ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు కలిసి ఆ ఇద్దరు అమ్మయిలను ఎలా కాపాడుకున్నారు? విలన్‌తో ఎలా యుద్ధం చేశారు అన్నది కథ.

టెక్నికల్‌గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అంతా కూడా సోసో అన్నట్టు ఉంటుంది. మ్యూజిక్ కూడా సేం టు సేం. కాకపోతే కృష్ణుడిగా నానీ పండించిన కామెడీ మాత్రం కాస్త రిలీఫ్. అలాగే బ్రహ్మాజీ కూడా నవ్వించాడు. ఈ రెండు ప్లస్ పాయింట్స్ పక్కన పెడితే ఇక సినిమాలో వేరే ఏమీ లేదు. కృష్ణుడిగా విలేజ్ కుర్రాడి పాత్రలో ఇరగదీసిన నానీ……రాక్‌స్టార్‌గా మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. నటించడం రాక నానీ ఫెయిల్ అయిన పాత్రగా అర్జున్ క్యారెక్టర్ ఉదాహరణగా నిలిచేలా ఉంది. రాక్ స్టార్ క్యారెక్టర్‌కి నానీ బాడీ లాంగ్వేజ్ అస్సలు సూట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొన్ని కామెడీ ఎపిసోడ్స్‌తో పెద్దగా కథాపరమైన ఆసక్తులు లేకుండానే బండిలాగించిన డైరెక్టర్ గాంధీ సెకండ్ హాఫ్‌లో మాత్రం పూర్తిగా చతికల పడ్డాడు. సీరియస్ కథాంశం…..అన్నీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినప్పటికీ ఎక్కడా కూడా కథనాన్ని కాస్త ఆసక్తికరంగా మలచలేకపోయాడు. అంతా ప్రేక్షకులు అనుకున్నట్టుగా సాగుతూ ఉండడం…..అది కూడా అస్సలు ఆసక్తికలిగించిన సన్నివేశాలతో సాగతీత వ్యవహారంలా మారడంతో సినిమా పూర్తిగా ఫెయిల్యూర్ బాట పట్టేసింది.

మొత్తంగా చూస్తే కృష్ణుడు పండించే కామెడీ, కొన్ని కామెడీ సన్నివేశాలు పక్కనపెడితే ఇక సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథ, కథనాలు అటూ ఇటూ ఉన్నా బండిని లాక్కొచ్చే నానీ కూడా ఈ సారి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మొత్తానికి వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నానీకి ఫస్ట్ బ్రేక్ అయితే పడినట్టే కనిపిస్తోంది.
రేటింగ్ః 2.25/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -