Sunday, April 28, 2024
- Advertisement -

కొరటాలకు కోపం వచ్చింది.. అలా ఎవరు చేయకండి

- Advertisement -

కొరటాల శివ ఎంత కమిట్మెంట్ ఉన్నటువంటి దర్శకుడో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతను ఒకటి అనుకుంటే అది చేసే వరకు నిద్రపోడు.తన సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి ఇష్టపడని దర్శకుడాయన.అలాంటి ఎంతో ప్రెస్టీజియస్ అనుకున్నటువంటి భరత్ అనే నేను చిత్రం తాలూకు విషయాలు బయటకు లీక్ అవ్వడం కొరటాలలో కోపాన్ని పెంచేశాయి.

తాజాగా బయటకు వచ్చిన ఓ స్టిల్ ..మహేష్ సిఎం గెటప్ ను బయట పెట్టింది. నిజానికి ఈ పోజును కొరటాలకు తెలియకుండానే ఎవరో బయటకు తెచ్చేశారు. దీంతో సినిమా ఎలా ఉంటుందో అందరూ ఓ అంచనాకు వచ్చేస్తారు. అదే ఇప్పుడు కొరటాలలో అసహనానికి దారి తీసింది. ఇదనే కాదు గతంలో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రీ షూట్ చేస్తున్న టైమ్లో కూడా ఇలాగే విషయాలు బయటకు పొక్కడంతో అప్పట్లో అసహనానికి గురయ్యాడు.

అలాగే తాజాగా లీకైన మహేష్ స్టిల్ తో కొరటాల కోపానికి గురయ్యాడు. ఇక్కడ ఎవరిమీద రంకెలు వేయాలో తెలియక దయచేసి ఆన్ లైన్ లో ఎవరూ ఈ ఫోటోను తిరిగి షేర్ చేయవద్దని.. అభిమానులు కూడా ఇది పక్కాగా ఫాలో కావాలని విన్నవించాడు. మంచి ఔట్ పుట్ ఇచ్చేందుకు తాము కష్టపడుతున్నామని …లీక్ విషయంలో జనాలను బాగానే బతిమిలాడుకున్నాడు. ప్రస్తుతం ఈ లీక్ ఎక్కడి నుంచి జరిగిందో తెలియక బుర్ర బద్దలు గొడుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -