సూపర్ స్టార్ మహేష్ బాబు తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం లో చేయనున్నారు. ఈ సినిమా ని అనిల్ సుంకర నిర్మించనున్నారు. అయితే దిల్ రాజు కూడా ఈ సినిమా లో భాగం అవ్వాలని కోరుకుంటున్నారు అనే విషయం తెలుస్తుంది. ఇక పోతే మహేష్ 27 వ చిత్రం ఎవరితో చేస్తారు అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికే పరశురామ్ ఒక స్క్రిప్ట్ ని మహేష్ కి వినిపించి తన మెప్పు ని పొందారు. అయితే మహేష్ మాత్రం ఫైనల్ డ్రాఫ్ట్ విరిపించే వరకు ఈ సినిమా కి అంగీకారం తెలిపేలా లేడు. పరశురామ్ మాత్రం ఈ సినిమా కచ్చితం గా ఒకే అవుతుంది అనే ఉదేశ్యం తో ఉన్నాడు.
ఇకపోతే గీత ఆర్ట్స్ ఈ 27 వ చిత్రాన్ని నిర్మించాలని ప్రయత్నిస్తుంది. అల్లు అరవింద్ కూడా తరచుగా మహేష్ నమ్రత లని కలిసి ప్రాజెక్ట్ గురించి చర్చలు చేస్తున్నారు. ఈ సమయం లో ఈ ప్రాజెక్ట్ మాత్రం గీత ఆర్ట్స్ చేసే లా కనిపించడం లేదు అని తెలుస్తుంది. కొరటాల శివ మరియు తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ కలిసి ఈ మహేశ్ 7 ని నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. మహేష్ తో ఇప్పటికే రెండు హిట్ లు అందించిన కొరటాల మహేష్ ని ఈజీ గా తన వైపుకు మళ్ళించుకోనున్నారట.