బాత్ ట‌వ‌ల్‌తో ద‌ర్శ‌నం ఇచ్చిన మ‌హేశ్ హీరోయిన్‌

- Advertisement -

కృతి స‌న‌న్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచియం ఉన్న పేరు. ఎందుకంటే తెలుగులో ఆమె న‌టించింది త‌క్కువ సినిమాలే అయినప్ప‌టికి మ‌హేశ్ బాబు వంటి సూప‌ర్ స్టార్‌తో సినిమా చేయ‌డంతో ఈ భామ అంద‌రికి గుర్తుండి పోయింది. ఈ సినిమా ఫెయిల్ కావ‌డంతో ఆమెకు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. నాగ‌చైత‌న్య‌తో చేసిన ‘దోచెయ్’ సినిమా కూడా ఫెయిల్ కావ‌డంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది. అక్క‌డ మాత్రం మంచి అవ‌కాశాలు ద‌క్కించుకుంది. బాలీవుడ్‌లో కృతి బాగానే ఫేమ‌స్ అయింది. సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటోంది కృతి. సినిమాల సంగతి ఎలా ఉన్నా గానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కాస్త స్పీడే. ఇన్‌స్టాగ్రామ్‌లో కృతికి 16 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారంటేనే మనం ఈ భామ జోరును అర్థం చేసుకోవచ్చు.

అందుకే ఈ భామ ఖాతాలో పలు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్టులు ఉన్నాయి. త‌న సినిమాలతో పాటు,త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను గురించి అభిమానుల‌తో పంచుకుంటుంది ఈ భామ‌. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్‌గా మారింది. బాత్ ట‌వ‌ల్‌ను అడ్డుపెట్టుకుని ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది కృతి. అస‌లే హాట్ ఫిజిక్‌తో మ‌త్తెక్కించే కృతి, ఇలా ట‌వ‌ల్‌తో కనిపించే స‌రికి కుర్ర‌కారు గుండె జారినంత ప‌నైంది. ఈ ఫోజులో ట‌వ‌ల్‌ను త‌న బాయ్‌ఫ్రెండ్‌ను కౌగిలించుకున్నట్టు హత్తుకుని మ‌రి ఫోజు ఇచ్చింది ఈ భామ‌. ఇక కృతి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తోంద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇద్ద‌రు క‌లిసి తెగ తిరిగేస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -