Tuesday, May 21, 2024
- Advertisement -

ప్రసంశలు అందుకున్న “క్షణం”

- Advertisement -

3వ వారం లో కూడా థియేటర్స్ పెంచుతూ విజయపరంపర కొనసాగిస్తున్న “క్షణం” సినిమాని కొంతమంది సినీ ప్రముఖుల కోసం ఒక షో వేయడం జరిగింది. ఆ షో కి సినీ దర్శకులు, కూచిపూడి హోటల్స్ అధినేత కూచిపూడి వెంకట్ గారు హోస్ట్ చేయడం జరిగింది. ఈ షో కి ప్రముఖ సినీ దర్శకులు శ్రీను వైట్ల, శివ నాగేశ్వరరావు, చైతన్య దంతులూరి, చంద్ర సిద్దార్థ్ వంటి పలువురు సినిమాని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. 

శ్రీను వైట్ల మాట్లాడుతూ “క్షణం సినిమా చాలా ఫ్రెష్ గా, ఇంటరెస్టింగ్ గా ఉంది. హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. ఇంత తక్కువ బడ్జెట్ తో చాలా మంచి క్వాలిటీ తో డైరెక్టర్ రవికాంత్ పేరేపు చాలా బాగా తీసారు. ఫోటోగ్రఫీ, background స్కోర్ చాలా బాగున్నాయి” అని చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. 

హరీష్ శంకర్ మాట్లాడుతూ “ప్రతీ విభాగం, ప్రతీ ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు. సినిమాని ఇంత బాగా తీసిన డైరెక్టర్ రవికాంత్, అడివి శేష్ లకి కంగ్రాట్స్. ప్రతీ ఆర్టిస్ట్ అద్భుతం గా నటించారు” అన్నారు. 

ఇంద్రగంటి మోహన కృష్ణ మాట్లాడుతూ “క్షణం సినిమా చాలా బాగుంది. ఇది కొత్తరకమైన ప్రయత్నం, అన్ని విభాగాలు కలిపి అద్భుతంగా తీశారు. టీం మొత్తానికి కంగ్రాట్స్, ముఖ్యంగా డైరెక్టర్ రవికాంత్ పేరేపు, అడివి శేష్ లకి కంగ్రాట్స్” అన్నారు.

శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ “క్షణం సినిమా క్షణ క్షణం ఉత్కంఠం గా ఉంది. ఇటువంటి కొత్త సినిమాలు తెలుగు లో రావాలని కోరుకుంటున్నాను” అన్నారు. 

చైతన్య దంతులూరి మాట్లాడుతూ “క్షణం సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నటీనటులు అందరూ బాగా చేసారు” అన్నారు. 

చంద్ర సిద్దార్థ్ మాట్లాడుతూ “క్షణం సినిమా క్షణ క్షణం మరుక్షణం ఏమవుతోందో అన్న సస్పెన్స్ తో ఉంది. దర్శకుడు సినిమాని తీర్చిదిద్దిన తీరు చాలా బాగుంది” అని యూనిట్ కి అభినందనలు తెలియచేసారు.

అడివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ తదితరులు నటించారు. స్టొరీ : అడివి శేష్, ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరేపు, సినిమాటోగ్రఫీ : షనిల్ డియో, సాహిత్యం : సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి, నిర్మాత : పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, దర్శకత్వం : రవికాంత్ పెరేపు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -