Tuesday, May 14, 2024
- Advertisement -

నాని సినిమాపై కేటీఆర్ కామెంట్స్

- Advertisement -

నాని సినిమా చూసిన తర్వాత ఎవరైన.. నానిని పోగడకుండా ఉండలేరు. నటుడిగా నాని అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. తెలుసు సినీ పరిశ్రమలో చాలా మంది నాని నటనను ఇష్టపడుతుంటారు. అయితే ఇప్పుడు నానికి ఓ రాజకీయ ప్రముఖుడి నుంచి ప్రశంసలు దక్కాయి.

ఆ రాజకీయ ప్రముఖుడు ఎవరో కాదు.. తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ మధ్య కాలంలో తరచుగా సినిమా పంక్షన్లకు వస్తూ సినిమాల గురించి మాట్లాడుతున్న కేటీఆర్.. నాని మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఈ తరం అత్యుత్తమ నటుల్లో నాని ఒకడని కితాబిచ్చాడు కేటీఆర్. అతను ‘బ్రిలియంట్ పెర్ఫామర్’ అంటూ పొగిడేశారు. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ వారంలోనే నాని సినిమాలు రెండు చూశాడట కేటీఆర్.

ఆ సినిమాలేవని కేటీఆర్ చెప్పలేదు కానీ.. అందులో ఒకటి నాని లేటెస్ట్ రిలీజ్ ‘నిన్ను కోరి’ అయ్యుండొచ్చు. థియేటర్లలో ఉన్నదైతే ఈ ఒక్క సినిమానే. మరి కేటీఆర్ చూసిన మరో నాని సినిమా ఏదో.. దాన్ని ఎక్కడ చూశాడో? ఏదేమైనా రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుడు ఇలా స్వచ్ఛందంగా నాని మీద ప్రశంసలు కురిపించడం విశేషమే. మంచి కథలతో.. మంచి సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కేస్తున్నాడు నాని. ఇక ఎంత ఎదిగా ఒదిగి ఉండే నాని వ్యక్తిత్వంను కూడా చాలా మంది ఇష్టపడుతారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -