Sunday, May 5, 2024
- Advertisement -

కుర్ర హీరోతో.. సీఎం భార్య హాట్ రొమాన్స్..

- Advertisement -

కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి భార్య రాధిక.. మాజీ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. కుమార స్వామి, రాధికలు దాదాపు పదేళ్ల క్రితం.. పెళ్లి చేసుకున్నారు. వీరి ఓ పాప కూడా ఉంది. అయురే ఇటివలే వీరిద్దరు కొన్ని కారణాల వల్ల విడిపోయారు.

భర్త నుంచి ఇంకా అధికారికంగా విడాకులు తీసుకోని రాధిక మళ్లీ సినిమాల్లో నటించేందుకు రెడీ అయింది. అది కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కాకుండా ఒక యువ హీరోకు జోడీగా మాంచి రొమాంటిక్‌ మూవీలో హీరోయిన్ గా నటించేందుకు సిద్దం అయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య మళ్లీ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇవ్వడం అంటే అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది కూడా ఒక యువ హీరోతో శృంగారం చేసే సినిమా చేయడం మరింత విడ్డూరంగా ఉంది అంటూ సినీ వర్గాల వారు మరియు రాజకీయ వర్గాల వారు షాక్‌ అవుతున్నారు.

గతంలో రాధిక పలు చిత్రాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికి కూడా కన్నడంలో రాధిక సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఒక పాప ఉన్న.. సినిమాలకు పది సంవత్సరాలు గ్యాప్‌ వచ్చినా కూడా రాధిక అందంలో ఏమాత్రం మార్పులు రాలేదు. దాంతో ఆమెతో రొమాన్స్‌కు ఆ కుర్ర హీరో ఉవ్విల్లూరుతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి భార్య అయిన రాధిక మళ్లీ కన్నడ ప్రేక్షకులను అలరిస్తుందా, మళ్లీ బిజీ హీరోయిన్‌గా అవుతుందా అనేది చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -